తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి రూ. 2,500.. ఆ రోజు నుంచే..!
తెలంగాణ ప్రభుత్వం త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రూ. 2,500 పథకంపై క్లారిటీ ఇవ్వనుంది. ఈ నెల 25 న జరిగే క్యాబినెట్ భేటీలో ఈ పథకంపై చర్చించనున్నారు. అన్ని విభాగాల నుంచి క్యాబినెట్ భేటీకి నివేదికలు పంపించాలని ఇప్పటికే సీఎస్ రామకృష్ణారావు సంబంధిత అధికారులకు సూచించారు. అటు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దానిపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది ప్రభుత్వం. ఎన్నికల్లో ఆరు గ్యారంటీల ద్వారా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రారంభించారు. అనంతరం రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా మహాలక్ష్మి పథకంలో మరో విభాగం అయిన మహిళలకు రూ. 2,500 పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఈ నెల 25 న జరిగే క్యాబినెట్ భేటీలో ఈ పథకంపై చర్చించనున్నారు.
తెలంగాణలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులనే చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 18-55 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందించే దిశగా కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతోంది. ఈ మేరకు అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 25 న జరిగే క్యాబినెట్ భేటీలో ఈ పథకంపై పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అధికారులు సెర్ప్, మెప్మా నుంచి మహిళల వివరాలను తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) వడ్డీలేని రుణాల చెక్కులను ఇటీవల పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 18 లోపే మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ చేసింది. ఈ పథకం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.344 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది.












Click it and Unblock the Notifications