ఏడాదిలో ఇంతమంది అబార్షన్లు చేయించుకున్నారా..!
అమ్మతనాన్ని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. కొత్తగా పెళ్లైనప్పటికీ కొద్ది నెలలు లేదా సంవత్సరాలు తమ ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర కారణాలతో కపుల్స్ పిల్లలను నేటి కాలంలో లేటుగా ప్లానింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మరో పక్క సంతానం కోసం హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు లక్షలు ఖర్చు చేస్తున్న దంపతుల వ్యథలు మరోపక్క. కానీ ఇదే సమయంలో అబార్షన్స్ రేటు కూడా అంతే వేగంగా పెరిగిపోతోందని గణాకాలు చెప్పటం ఆశ్చర్యకరంగా మారింది.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన అధికారిక డేటా ప్రకారం తెలంగాణలో 2024-25 ఆక్థిక సంతవ్సరంలో అబార్షన్స్ సంఖ్య 16వేల 059గా ఉంది. 2020-21తో పోల్చితే కేవలం ఐదేళ్ల కాలంలోనే అబార్షన్స్ చేయించుకుంటున్న మహిళల సంఖ్య ఏకంగా 10 రెట్లు పెరిగిపోవటం ఆందోళనను సూచిస్తోంది. ఇక పొరుగున ఉన్న ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 2024-25లో 10వేల 676 అబార్షన్స్ అధికారికంగా రికార్డ్ అయ్యాయి. ఐదేళ్లలో ఈ సంఖ్య ఏపీలో 4 రెట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

ఇక దేశంలోని మిగిన రాష్ట్రాల్లో పరిస్థితిని చూస్తే మహారాష్ట్రంలో అత్యధికంగా 2లక్షల 7వేల 019 అబార్షన్స్ నమోదయ్యాయి. ఇక రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో ఈ సంఖ్య లక్ష వెయ్యి 414, అసోంలో 76వేల 642, కర్ణాటకలో 70వేల 241, రాజస్థాన్ లో 53వేల 714గా నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications