ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.. ఆటో రోడ్డు మీదకు వెళ్తేనే జేబులో నాలుగు రాళ్లు పడేది.. రాత్రింబవళ్లు తిరిగినా సంపాదన అంతంత మాత్రమే ఇదీ హైదరాబాద్ నగరంలోని ఆటో డ్రైవర్ల దుస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళ ఉచిత బస్సు పథకం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు మెట్రో రైలు ప్రయాణానికి నగరవాసులు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణించేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది.
ఆటో డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకున్న రేవంత్ సర్కార్ వారికోసం అదిరిపోయే వార్త చెప్పింది. ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారి చేశారు. ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతిస్తామని తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఎల్‌పీజీలుగా మార్చడానికి అనుమతిచ్చినట్లు వెల్లడించారు.

ఆటో డ్రైవర్ల అభ్యర్థనల మేరకు వారి అభివృద్ధికై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కొత్త ఆటోలకు పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తామన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతిస్తామన్నారు. దీంతోపాటు 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఎల్‌పీజీలుగా మార్చేందుకు సైతం అనుమతులు జారీ చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 65 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications