అపెక్స్ కౌన్సిల్: భాషా పరమైన సమస్య, ఇద్దరు చంద్రులు ఎలా అధిగమించారు?
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదంపై చర్చించేందుకు గత వారంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భాష సమస్యను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.
కేంద్ర మంత్రి ఉమాభారతికి ఇంగ్లీషు రాదు. రాదంటే రాదని కాదు అర్ధం అవుతుంది కానీ ఆమె తిరిగి మాట్లాడలేదు. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌కు హిందీ వస్తుంది, కానీ చంద్రబాబుకు హిందీ అర్ధం అవుతుంది కానీ మాట్లాడలేరు. అయినప్పటికీ, ఈ భేటీలో వారు భాషా పరమైన సమస్యను ఎలా అధిగమించారు?

ప్రాజెక్టులకు అనుమతులు లేవు
వివరాల్లోకి వెళితే.. కృష్ణానది ఎగువ ప్రాంతంలో శ్రీశైలం రిజర్వాయర్ పైభాగాన తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్టులకు అనుమతులు లేవంటూ కృష్ణాజిల్లా బాపులపాడు డిస్ర్టిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణతో పాటు మరో 11 మంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర జలసంఘం "తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు లేవని'' అఫిడవిట్ దాఖలు చేసింది.

అపెక్స్ కౌన్సిన్ ఏర్పాటు
దీని ఫలితంగా కోర్టు అపెక్స్ కౌన్సిన్ ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాలతో మాట్లాడాలని జలవనరుల సంఘాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో జలవనరుల శాఖ ఈ నెల 21న కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగురాష్ర్టాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, హరీశ్‌రావు, కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ఎస్.కె.జోషీ, ఇంజినీరింగ్ ఛీఫ్‌లు తదితరులు హాజరయ్యారు.

ఇంగ్లీషు రాని ఉమాభారతి
ఈ సమావేశ ప్రారంభంలో హిందీలో మాట్లాడిన ఉమాభారతికి ఇంగ్లీషు రాదని ఇరు రాష్ర్టాల సీఎంలకు, అధికారులకు తెలిసిపోయింది. ఉమాభారత తర్వాత సీఎంలు మాట్లాడే సమయం వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హిందీ వచ్చు కాబట్టి హిందీతో పాటు ఇంగ్లీషు కలగలిపి పాల్గొన్న అధికారులకు, కేంద్రమంత్రి ఉమాభారతికి అర్ధమయ్యే రీతిలో చెప్పారు. ఇక చంద్రబాబు వంతు వచ్చింది. చంద్రబాబుకు హిందీ అర్ధమవుతుందిగానీ తిరిగి మాట్లాడలేని పరిస్థితి. దీంతో ఆయన చేసేదేమీ లేక ఇంగ్లీషులో తన వాదనను వినిపించారు.

అర్ధమయ్యే రీతిలో చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రైజెంటేషన్
అయితే తన వాదన మొత్తం ఇంగ్లీషు రాని ఉమాభారతికి అర్ధం అవుతుందా? లేదా అన్న సందేహం వచ్చిన చంద్రబాబు ఆమెకు అర్ధమయ్యే రీతిలో పవర్‌పాయింట్ ప్రైజెంటేషన్‌ను హిందీ, ఇంగ్లీష్‌లలో కలగలిపి చెప్పించారు. దీంతో తాను చెప్పిన వాదన మొత్తం ఉమాభారతికి అర్ధం అయి ఉంటుందని చంద్రబాబుతో సహా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు "ఉమాభారతికి ఇంగ్లీష్ అర్ధమవుతుంది కానీ, మాట్లాడలేరు'' అని చెప్పడంతో ఇరు రాష్ట్రాల అధికారులు కంగుతిన్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications