అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ఘటనపై కొండా సురేఖ చొరవ..
జీవన్‌ను వరంగల్ జిల్లాకు చెందిన యువకుడిగా అధికారులు గుర్తించారు. ఐదేళ్ల క్రితం ఎంబీఏ పూర్తి చేసి అమెరికా వెళ్లినట్లుగా చెబుతున్నారు.
న్యూయార్క్: అమెరికాలో తెలుగువారిపై వరుస విద్వేష దాడులకు తోడు.. అనుమానస్పదంగాను, ప్రమాదంలోను మరణించే మృతుల సంఖ్య కలవరపెడుతూ ఉంది. తాజాగా న్యూయార్క్ లో చింతకింది జీవన్(30) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
జీవన్‌ను వరంగల్ జిల్లాకు చెందిన యువకుడిగా అధికారులు గుర్తించారు. ఐదేళ్ల క్రితం ఎంబీఏ పూర్తి చేసి అమెరికా వెళ్లినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో మానవ వనరుల విభాగంలో విధులు నిర్వహిస్తున్న అతను సోమవారం నాడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

ప్రమాదంలో జీవన్ మృతి చెందినట్లు హైదరాబాద్‌లోని అతని సోదరి రేణుకకు సమాచారం అందింది. ప్రస్తుతం టెక్సాస్ లోని ఓ ఆసుపత్రిలో అతని మృతదేహాన్ని ఉంచినట్లుగా తెలుస్తోంది. జీవన్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ ఘటనపై స్పందించారు. జీవన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications