చంద్రబాబు, రేవంత్ సమర్దతకు పరీక్ష ...!!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కొత్త పోటీ మొదలైంది. ఇద్దరు సీఎంలు తమ రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్దిక సదస్సు లో ఇద్దరూ పాల్గొనేందుకు తమ టీంలతో అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు నేతలు జ్యూరక్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. కానీ, పెట్టుబడు ల ఆకర్షణలో మాత్రం పోటీ తప్పేలా లేదు. దీంతో, ఇద్దరికీ ఈ సదస్సు పరీక్షగా మారుతోంది.
దావోస్ లో ప్రపంచ ఆర్దిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ చేరుకున్నారు. జ్యూరక్ విమానాశ్రయంలో ఇద్దరు సీఎంల మధ్య మాటా మంతి జరిగాయి. జ్యూరిచ్ లోని హోటల్ హిల్టన్ లో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పొరా మీట్ లో వీరిద్దరూ పాల్గొంటున్నారు. యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొన్నాయి. స్థానిక రాయబార కార్యాలయం ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఆ వెంటనే ఇరు రాష్ట్రాల సీఎంలు దావోస్ చేరుకుంటారు.

జ్యూరిక్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు జ్యూరిచ్ వెళ్లిన ఏపీ అత్యున్నత స్థాయి బృందంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రు లు లోకేష్, టీజీ భరత్, అధికారులు ఉన్నారు. రేవంత్ టీంలో మంత్రి శ్రీధర్ బాబు తో సహా అధికారులు పాల్గొంటున్నారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయం లోనూ దావోస్ సదస్సుకు హాజరయ్యారు.

గత ఏడాది ఈ సదస్సులో పాల్గొన్న రేవంత్ వరుసగా రెండో ఏడాది హాజరవుతున్నారు. దీంతో.. మూడు రోజుల పాటు సాగే పెట్టుబడుల సదస్సులో పలువురు ప్రముఖులతో ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ పెట్టుబడుల కోసం ఈ ఇద్దరు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications