యాదాద్రి కాదు, యాదగిరి గుట్టనే - పేరు మార్పు..!?
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మరోసారి మారబోతోందా. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో యాదగిరి గుట్ట పేరును యాదాద్రిగా మార్పు చేసారు. ఏపీలోని తిరుమల తిరుపతి స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి చెందాలని.. యాదాద్రి అని నామకరణం చేశారు. శ్రీలక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించినప్పుడు ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని యాదగిరి గుట్టగానే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీలక్ష్మీ నరసింహుడు కొలువై ఉన్న యాదాద్రి పేరును మార్పు పైన చర్చ సాగుతోంది. సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఈ యాదాద్రి పేరును త్రిదండి చినజీయర్ స్వామి సూచించారన్న ప్రచారం కూడా జరిగింది. చాలా కాలంగా యాదాద్రి అనే ప్రస్తావిస్తున్నారు. కొంత కాలంగా యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఈ పేరు మార్పు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. యాదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని ఆలయ సన్నిధిలో వెల్లడించారు.

ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. త్వరలోనే సీఎం క్షేత్ర సందర్శనకు రానున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా ప్రయత్నిస్తామని వివరించారు. కొండ పై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పూర్వం నుంచి ఈ క్షేత్రానికి ఉన్న పేరు మార్చటం సరి కాదన్నారు. ఆలయ పూజారుల కోసం విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో, ఇప్పుడు యాదాద్రి పేరు మార్పు పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications