Vaikunta Ekadasi: ఆలయాలకు వైకుంఠ ఏకాదశి శోభ.. పోటెత్తిన భక్తులు..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా యాదాగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తర ద్వార గుండా దర్శనానికి ఏర్పాట్లు చేయడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఉదయం 6 గంటల 48 నిమిషాలకు భక్తులకు ఉత్తర ద్వార గుండా లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమల

తిరుమల


తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఆరంభమైంది. భక్త జనం పోటెత్తారు. శ్రీవారికి నిర్వహించే కౌంకర్యాలు పూర్తయ్యాక అర్ద్రరాత్రి 12.05 గంటలలకు ఉత్తర ద్వారా దర్శనాలు ప్రారంభించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

ధర్మపురి

ధర్మపురి


ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలొచ్చారు. గోదావరిలో స్నానమచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఉదయం 2:30 నిమిషాలకు ఆలయ అర్చకులు లక్ష్మీ సమేత యోగ, ఉగ్రనరసింహ, వెంకటేశ్వర స్వామి స్వాముల మూల విరాట్ లకు మహా క్షీరాభిషేకాలు నిర్వహించారు.

వేములవాడ

వేములవాడ


వేములవాడలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలొచ్చారు. ఉత్తర ద్వారం ద్వార భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ రకాల పూలతో అలంకరించిన అంబారి వాహనంపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.

భద్రాచలం

భద్రాచలం

భద్రాచలంలో కూడా భక్తులు రద్దీ పెరిగింది. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజామున సీతారాములకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా నిన్న భద్రాచలంలో తెప్పొత్సవం నిర్వహించారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నవరం, భద్రాచలం, విజయవాడ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

లక్ష్మీగణపతి

లక్ష్మీగణపతి


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల లక్ష్మీగణపతి ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలొస్తున్నారు. ఖాసీంపేటలోని మానస దేవి ఆలయానికి కూడా భక్తులు తరలొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+