Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే వారికి ముఖ్య గమనిక..!!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే వాహనదారులకు ముఖ్య సూచన జారీ అయింది. ఈ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణం- అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను సులభతరం చేసే దిశగా కొత్త పార్కింగ్ విధానం అక్కడ అమలులోకి వచ్చింది. ఇందులో పొరపాట్లు చేస్తే అదనపు ఛార్జీలను చెల్లించాల్సి వస్తుంది.

ప్లాట్‌ఫారమ్ 1 వైపున పార్కింగ్‌..

ప్లాట్‌ఫారమ్ 1 వైపున పార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ కేవలం పికప్, డ్రాప్ సేవలకు మాత్రమే అనుమతి. ఏ ఒక్క వాహనం కూడా అక్కడ పార్క్ చేయడానికి వీలు లేదు. ప్లార్కింగ్ సౌకర్యం మొత్తాన్నీ తొలగించారు. ప్లాట్‌ఫారమ్ 10 వైపు అనధికార పార్కింగ్‌ను నివారించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ జోన్‌లోకి వచ్చే వారికి 15 నిమిషాల వరకు ఉచిత పికప్, డ్రాప్ ఉంటుంది.

Temporary parking changes at Secunderabad Railway Station during major upgrade work

ఓవర్‌స్టే ఛార్జీలు

ఆ తర్వాత నిర్దేశిత పార్కింగ్ స్థలంలో లేని వాహనాలకు ఓవర్‌స్టే ఛార్జీలు వర్తిస్తాయి. నిరంతరాయ ట్రాఫిక్ ప్రవాహం, ప్రయాణీకుల సౌకర్యం లక్ష్యంగా ఈ చర్యలున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్‌ఫారమ్ 10 భూగర్భ బేస్‌మెంట్‌లో 4- వీలర్లు, 2- వీలర్లకు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇది బోర్డింగ్, పికప్, డ్రాప్‌లకు ఉపయోగపడుతుంది. ప్లాట్‌ఫారమ్ 10 బేస్‌మెంట్‌లోని అధీకృత పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు.

ఛార్జీలు వివరాలు..

4- వీలర్లు తొలి రెండు గంటలకు 40 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఆపై ప్రతి అదనపు గంటకు 20 రూపాయలను వసూలు చేస్తారు. 2- వీలర్లకు తొలి రెండు గంటలకు 25 రూపాయలనను వసూలర చేస్తారు. తర్వాత ప్రతి గంటకు 10 రూపాయల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సైకిళ్లకు తొలి రెండు గంటలకు అయిదు రూపాయలు, ఆపై ప్రతి అదనపు గంటకు రెండు రూపాయలు చెల్లించాలి.

పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్..

ప్రయాణీకులకు సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంలో భాగంగా ప్రయాణీకుల సౌకర్యం కోసం స్టేషన్ లోని ముఖ్యమైన ప్రదేశాల్లో స్పష్టమైన దిశానిర్దేశక బోర్డులను అమర్చారు. పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా స్టేషన్ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలు రాకపోకలు సాగించడానికి, ఓవర్-స్టే ఛార్జీలను నివారించడానికి ప్లాట్ ఫామ్ నంబర్ 10 వైపు ఏర్పాటు చేసిన బేస్మెంట్ పార్కింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

చురుగ్గా పనులు..

పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, రైళ్లు, ప్లాట్ ‌ఫామ్‌ల సంఖ్యకు అనుగుణంగా దీన్ని మరింత విస్తరిస్తోన్నారు. ఎయిర్‌పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఈ స్టేషన్ ఇక రూపాంతరం చెందబోతోంది. విమానాశ్రయాల్లో ఉన్నటువంటి సౌకర్యాలను ఈ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి తీసుకుని వస్తామని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి చెందిన తరువాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతోందనే విషయం మీద రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఇదివరకే కొన్ని మోడల్ ఫొటోలను విడుదల చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+