కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో తాత్కాలిక ఊరట
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్స్ విసిరి దాడి చేసిన అంశంలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌ల సభ్యత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా నేతల నియోజకవర్గాలైన నల్గొండ, అలంపూర్ ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశించింది.

కనీసం ఆరు వారాల వరకు ఆగాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ వివాదంపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు లేదని, సభ్యత్వం రద్దు చేయాలంటే ముందు ఎథిక్స్ కమిటీకి సమస్య ను నివేదించాలని ఎటువంటి నిబంధనలు పాటించకుండానే తమ సభ్యత్వాలను రద్దు చేశారని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications