రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్!

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించే రైతు భరోసా పథకం చెల్లింపులు ఆలస్యం కావడంతో రైతు భరోసా పథకం పైన రైతులలో ఆందోళన వ్యక్తమవుతోంది. యాసంగి సీజన్ ప్రారంభమైన ఇంకా రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం జమ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతుభరోసా రాక రైతుల్లో ఆందోళన

ఫిబ్రవరి చివరివారంలో కానీ, మార్చి మొదటి వారంలో గాని రైతు భరోసా నిధులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న రైతన్నలు ఇప్పటివరకు రైతు భరోసా సాయం జమ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎకరానికి 6000 చొప్పున అందాల్సిన ఈ నిధులు ఆలస్యం కావడంతో విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

tension on rythu bharosa amount telangana farmers seeking clarity from revanth reddy government

రైతు భరోసా నిధుల కోసం రైతుల ఎదురుచూపులు

రైతు భరోసా నిధుల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రైతు భరోసాపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అసలు రైతు భరోసా నిధులు వస్తాయా లేదా అన్న అనుమానం కూడా రైతులలో వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు అతీగతీ లేకపోవడంతో రైతు భరోసా పైన నీలినీడలు కమ్ముకున్నాయి.

ప్రతిపక్షాల ప్రచారంతో రైతుల్లో మరింత ఆందోళన

దీనికి తగ్గట్టు ప్రతిపక్ష పార్టీలు ఇకపై రైతు భరోసా ఇచ్చేది లేదని, రైతు భరోసా నిధులను సీఎం ఢిల్లీకి పంపుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న క్రమంలో రైతులలో ఆందోళన మరింత పెరిగింది. ఆరుగాలం శ్రమించి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలు, ప్రభుత్వం అందిస్తుంది అనుకున్న పెట్టుబడి సాయం ఇప్పటివరకు అందకపోవడంతో లబోదిబోమంటున్నారు.

రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్

సీఎం రేవంత్ రెడ్డి స్పందించి రైతు భరోసా నిధులను త్వరితగతిన తమ ఖాతాలలో జమ చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే అన్నదాతలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతు భరోసా నిధులపై స్పష్టత ఇవ్వాలి. స్పష్టత ఇవ్వకుంటే ఖాతాల్లో డబ్బులు జమయ్యే వరకు రైతుల్లో అనిశ్చితి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+