కీలక పదవులు ఖరారు - రేవంత్ అనూహ్య ఎంపిక..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక పదవులు భర్తీ చేసారు. రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మూడు కమిషన్లలో సీనియర్లను ఛైర్మన్లుగా నియమించారు. తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ గా కిసాన్‌ కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు కోదండ రెడ్డి, తెలంగాణ విద్య కమిషన్‌ చైర్మన్‌ గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆకునూరి మురళిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. బీసీ కమిషన్ ఛైర్మన్ గా నిరంజన్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నియామకాలు
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నియామకాలు చేపట్టారు. సుదీర్ఘ కసరత్తు తరువాత పార్టీ సీనియర్ నేత కోదంరెడ్డిని రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ గా నియమించారు. అదే విధంగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆకునూరి మురళిని తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ను బీసీ కమిషన్ ఛైర్మన్ గా ఎంపిక చేసారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగుతారు.

TG Govt appoints Chairmans for Three Commissions details here

రేవంత్ ఎంపిక
వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు లక్ష్యాలను వివరిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. కోదండ రెడ్డి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు. తన రాజకీయ జీవితం మొత్తం కిసాన్‌ కాంగ్రెస్‌ లోనే సేవలందించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఆకునూరి మురళి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాగో తెలంగాణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ విజయంలో సహకరించారు. తొలి నుంచి అంచనా వేస్తున్నట్లుగానే ఆయనకు తెలంగాణ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ చైర్మన్‌ గా పగ్గాలు అప్పగించారు.

సీనియర్లకు ప్రాధాన్యత
బీసి కమిషన్ ఛైర్మన్ గా నిరంజన్ తో పాటుగా సభ్యులుగా తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, భాగ్యలక్ష్మిని నియమించారు. ప్రభుత్వం వ్యయసాయ కమిషన్ ద్వారా తమ ప్రాధాన్యతలను స్పష్టం చేసింది. కమిషన్‌ కు చైర్మన్‌ తో పాటు గరిష్టంగా ఆరుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. ఇక..మిగిలిన నామిటేడ్ పదవుల పైన కసరత్తు కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ నియామకం పూర్తి కావటంతో..ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవులు ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+