రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్, ఇదే లాస్ట్ డేట్ - లేకుంటే రద్దు..!!
తెలుగు రాష్ట్రాలలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా రేషన్ కార్డుల కోసం దర ఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త కార్డుల జారీతో పాటుగా ఉన్న కార్డుల్లో పేర్లు మార్పు వంటి పనులు జరుగుతున్నాయి. తాజాగా రేషన్‌కార్డుదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. మీ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే ఈ కేవైసీ తప్పని సరి చేసారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ కేవైసీ పూర్తి చేయని వారికి కార్డులు అమల్లో ఉండదని తేల్చి చెప్పారు.
రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి చసింది. రేషన్ పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దడానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం చెప్పుకొచ్చింది. రేషన్ కార్డ్ ఈ కేవైసీ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. కానీ ఇప్పటికీ చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. గతంలో ప్రభుత్వం దీన్ని పూర్తి చేయడానికి మార్చి 31, 2025 చివరి తేదీగా నిర్ణయించింది. కానీ సాంకేతిక సమస్యల వల్ల చాలా మంది లబ్ధిదారులు e KYC పూర్తి చేయలేకపోయారు. దీంతో ఈ గడువును మరొక్కసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025, జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

ఇదే చివరి అవకాశం గా అధికారులు చెప్పుకొచ్చారు. ఈ తేదీ దాటితే ఈసారి ప్రభుత్వం గడువు పెంచదని సమాచారం. కాబట్టి ఈకేవైసీ చేయించుకోని లబ్ధిదారులు ఈ డేట్‌లోపు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, ప్రభుత్వం మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేస్తోంది. జూన్‌లో సరుకులు తెచ్చుకుంటే ఆగస్టు వరకు రేషన్ షాపులకు వెళ్లే అవసరం లేదు. కానీ ఈకేవైసీ గడువు జూన్ 30 వరకు మాత్రమే. కాబట్టి అంతకుముందే ఈ కేవైసీ చేయించుకోవడం మంచిది. లేదంటే మళ్లీ సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. దీంతో..ఇప్పటికే ఈ కేవైసీ కోసం ఏర్పాట్లు చేసారు. రేషన్ షాపులో ఉన్న పీఓఎస్ మెషిన్ ద్వారా మీ ఆధార్ వివరాలు నమోదు చేసి బయోమెట్రిక్ పూర్తి చేస్తారు.












Click it and Unblock the Notifications