మహిళలు, రైతుల కోసం భారీ కేటాయింపులు- ఒక్కొక్కరికి దక్కేదెంత...!!
Telangana Budget 2025: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. కాగా, ఈ బడ్జెట్ లో భట్టి రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం- రూ.36,504 కోట్లు గా పేర్కొన్నారు. బడ్జెట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్ పీ రూ.16,12,579 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతం నమోదు అయినట్లు వెల్లడించారు. ఇక.. ఈ బడ్జెట్ లో మహిళలు - రైతుల కోసం కీలక ప్రతిపాదనలు.. కేటాయింపులు చేసారు.
రైతుల కోసం కేటాయింపులు
ఈ బడ్జెట్ లో రైతుల కోసం వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించగా, నీటిపారుదల శాఖకు రూ.23,373 కోట్లు, పశుసంవర్ధకానికి రూ.1,674 కోట్లను కేటాయించారు. రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసి 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్లను రుణమాఫీ చేసినట్లు భట్టి వెల్లడించారు. రైతు భరోసా ద్వారా ప్రతీ ఎకరానికి రూ 12 వేలు చొప్పున అందిస్తున్నామని చెప్పిన భట్టి.. ఈ పథకం కోసం రూ 18 వేల కోట్లు కేటాయించారు. భూమిలేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో కూలీ కుటుంబానికి సంవత్సరానికి రూ.12,000 వేలు చెల్లించనున్నారు. ఇప్పటివరకు రైతులకు రూ.1206.44 కోట్ల బోనస్‌ను చెల్లించినట్లు భట్టి తన ప్రసంగంలో వెల్లడించారు.

హామీల అమలు
కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ అమలు కోసం రూ 3,683 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. ఇక.. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు (వడ్డిలేని రుణాలు) రూ 1,511 ప్రతిపాదించారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఆశ పెట్టి నిరాశ మిగిల్చిందని చెప్పుకొచ్చారు. దీంతో, అసంపూర్తిగా ఉన్న 34,545 ఇళ్లను రూ. 305 కోట్లతో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడిం చారు. ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని నలువైపులా శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక.. మహిళల కోసం కీలక నిర్ణయాలను వెల్లడించారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
మహిళల కోసం
ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామని భట్టి వెల్లడించారు. వీటితో పాటుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయించినట్లు వివరించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ నిలిచిందని భట్టి పేర్కొన్నారు. అదే విధంగా ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ బడ్జెట్ లో దాదాపు 56 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసారు. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ప్లాన్ 2050 రూపొందించామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు బడ్జెట్ లో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.
-
బడ్జెట్ లో కొత్త పథకాలు: వీరికి భారీగా లబ్ది - అమలు ముహూర్తం..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
మహిళలకు రూ 2500, పెన్షన్ల పెంపుపై బడ్జెట్ లో తేల్చిందిదే..!! -
భట్టి బడ్జెట్ తో ఉద్యోగులకు దక్కిందేంటి..!! -
ప్రతి నెల రూ.2 వేల స్కాలర్ షిప్, విద్యార్థుల కోసం అభయహస్తం -
తెలంగాణాలో ఆ గ్రామానికి గ్యాస్ చింతే లేదు.. ఎందుకంటే! -
అందరికీ హెల్త్ ప్రొఫైల్! వైద్యరంగంలో 'తెలంగాణ రైజింగ్' -
స్కూల్స్ లో బ్రేక్‌ఫాస్ట్.. ఇంటర్ విద్యార్ధులకు కొత్త పథకం -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications