పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలన నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో కాల పరిమితి విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు స్పీకర్ కలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో, ఇప్పుడు ఈ నిర్ణయం తెలంగాణలో రాజకీయంగా సంచలనంగా మారుతోంది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. దీని పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. బీఆర్‌ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై, వివరణ ఇవ్వాలని ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకూ స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా, వారికీ త్వరలోనే జారీ చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిపై స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.

కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ చర్చలు చేసారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం.. పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అయినా, సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసారు. అయితే, విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని తెలుస్తోంది.
తాజా నోటీసుల జారీతో సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ప్రసాద్ మార్ నిర్ణయం ప్రకటిస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది. కాగా.. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్ లోనే న్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అయితే, దానం నాగేందర్ మాత్రం గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సహా మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకొనే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications