ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఊహించని ట్విస్ట్, ఇక..!!
తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో, మూడు నెలల్లోకా పిటీషన్ల పైన చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. కాగా, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసారు. వీటికి ఆ ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ సమాధానం ఇచ్చారు. అయితే, ఇప్పుడు స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది. పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఆరుగురు ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డికి స్పీకర్ తాజా నోటీసులు జారీ చేశారు. మరిన్ని ఆధారాలు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో స్పీకర్ స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఈ నోటీసులు జారీ చేశారు. తద్వారా ఎమ్మెల్యేల విచారణను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. కాగా, తాజా నోటీసులతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

స్పీకర్ గతంలో ఇచ్చిన నోటీసులపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. ఈ సమాచారం బీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు చేసిన వారికి పంపారు. దీంతో.. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్‌రెడ్డికి గత సోమవారం రీజాయిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీంతో.. ఇప్పుడు ఈ నోటీసుల పైన ఎమ్మెల్యేలు ఏ విధంగా సమాధానం ఇస్తారు.. ఆ తరువాత స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications