ఎమ్మెల్యేల అనర్హత పై నిర్ణయం వేళ కీలక పరిణామాలు, ఇక నెక్స్ట్..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచాయితీ ఎన్నికలు రెండు విడతలు పూర్తయ్యాయి. మరో వైపు మంత్రివర్గ విస్తరణ.. పార్టీలో కీలక నిర్ణయాల దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోంది. ఇటు మరో వైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్లు గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల పై నిర్ణయం ప్రకటించేందుకు స్పీకర్ సిద్దమయ్యారు. ఈ సమయంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెక్స్ట్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల పై ఈ నెల 19వ తేదీ లోపల స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే 8 మందిపై విచారణ పూర్తి చేసి నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిన స్పీకర్‌ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలకు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పది మంది ఎమ్మెల్యేల పై సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ విచారణ నిర్వహిస్తున్నారు. పది మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్‌ సకాలంలో స్పందించి చర్యలు తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని హైకోర్టు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు సూచించింది.

tg-speaker-to-announce-decision-over-mlas-disqualification-petitions-before-19

కాగా, ఈ ఉత్తర్వులతో సంతృప్తి చెందని బీఆర్‌ఎస్‌ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది జులై 31వ తదీన ఆ పది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను మూడు నెలల్లో తేల్చాలని స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేశారు. నిర్దేశించిన మూడు నెలల గడువులోపు విచారణ పూర్తి చేయకపోవడంపై నవంబర్‌లో సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నట్లు పేర్కొ న్న సుప్రీంకోర్టు, త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా స్పీకర్‌ను హెచ్చరించింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు చెంది ఇప్పటికే క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తయింది.

ఆ ఎమ్మెల్యేలపై నిర్ణయం రిజర్వ్‌ చేసిన స్పీకర్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల విషయంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా వివరణ ఇవ్వకుండా మరింత సమయం కావాలని కోరారు. ఇద్దరు కూడా పార్టీ మారినట్లు పూర్తి ఆధారాలు బీఆర్‌ఎస్‌ నాయకులు స్పీకర్​ కు నివేదించ డంతో వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా ఈ నెల 19వ తేదీకి ముగియనుండడంతో ఆ లోగా స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటిం చాల్సి ఉంది. దీంతో.. ఇప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+