TGFDC యంగ్ ఫిల్మ్‌మేకర్ ఛాలెంజ్ 2026... నగదు బహుమతులు, యువతకు గోల్డెన్ ఛాన్స్!

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యువతకు శుభవార్త చెప్పింది. యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు వారికోసం మరోసారి సృజనాత్మక వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది బతుకమ్మ పండుగను పురస్కరించుకుని 'యంగ్ ఫిల్మ్‌మేకర్ ఛాలెంజ్-2026 సీజన్-2' పోటీని నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి. ముకుంద రెడ్డి ప్రకటించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను యువత సృజనాత్మకతతో ప్రజలకు చేరువ చేయడం ఈ పోటీ ప్రధాన లక్ష్యం.
ఈసారి పోటీలో గత విభాగాలకు అదనంగా మూడు కొత్త కేటగిరీలను ప్రవేశపెట్టారు. తెలంగాణ జానపద గీతాలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్ఫూర్తిదాయక వీడియోలు, వ్యాసాలు అనే విభాగాల్లోనూ యువత తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు.

TGFDC Young Filmmaker Challenge 2026 Season 2 for Bathukamma Festival with huge cash prizes

తెలంగాణ జీవన విధానం, జానపద కళలు, సంస్కృతి, పండుగలు, ప్రజలతో ముడిపడిన అంశాలను వినూత్నంగా ఆవిష్కరించేందుకు ఈ పోటీ మంచి అవకాశం కల్పిస్తోంది. షార్ట్ ఫిల్మ్ విభాగంలో పాల్గొనే వారు రూపొందించే చిత్రాల నిడివి గరిష్ఠంగా 3 నిమిషాలు మాత్రమే ఉండాలి. జానపద గీతాల విభాగంలో సమర్పించే పాటల నిడివి 5 నిమిషాలకు మించకూడదు. అన్ని వీడియోలను తప్పనిసరిగా 4K రిజల్యూషన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

పోటీలో పాల్గొనాలనుకునే యువత తమ ఎంట్రీలను 2026 సెప్టెంబర్ 23లోగా సమర్పించాలి. ఇందుకోసం [email protected]కు ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చు. అదేవిధంగా FilmFreeway వెబ్‌సైట్ ద్వారా కూడా ఎంట్రీలను అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. పోటీకి వచ్చిన అన్ని ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ పరిశీలించనుంది. సృజనాత్మకత, అంశాన్ని ఆవిష్కరించిన తీరు, సాంకేతిక నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేయనున్నారు.

ఎంపికైన విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేయనున్నారు. విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని అక్టోబర్ 18న ఘనంగా నిర్వహించనున్నట్లు టీజీఎఫ్‌డీసీ వెల్లడించింది. పోటీకి సంబంధించిన మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం 8125834009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.

రైతులకు కీలక అలెర్ట్... ఆ స్కీమ్ రావాలంటే ఈనెల10వ తేదీలోగా నమోదు చేసుకోవాలి!
రైతులకు కీలక అలెర్ట్... ఆ స్కీమ్ రావాలంటే ఈనెల10వ తేదీలోగా నమోదు చేసుకోవాలి!

బతుకమ్మ పండుగ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీ తెలంగాణ కథలు, జానపద కళలు, స్థానిక సంస్కృతిని ఆధునిక డిజిటల్ వేదికలపైకి తీసుకురావడమే కాకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు మంచి అవకాశంగా మారనుంది. యువ ఫిల్మ్‌మేకర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+