గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్. TGPSC కీలక అప్డేట్

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాలు, ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది TGPSC బోర్డు. జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పరిశీలన ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. జూన్ 18 నుంచి జులై 8 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది.

గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలెర్ట్. రాష్ట్రంలోని 1,388 గ్రూప్ 3 ఉద్యోగాలకు గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేసింది TGPSC బోర్డు. జూన్ 18 నుంచి గ్రూప్ 3 అభ్యర్థులకు సర్టిఫికెట్స్ పరిశీలన ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. జూన్ 18 నుంచి జులై 8 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల కారణంగా ఆయా తేదీల్లో హాజరు కాలేని అభ్యర్థుల కోసం జూలై 9 రిజర్వ్ డేగా ఉంటుందని కమిషన్ వెల్లడించింది. హైదరాబాద్‌ లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ బిల్డింగ్‌ లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది.

TGPSC Announces Group 3 Certificate Verification from June 18 to July 8

గ్రూప్ 3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రెండు సెషన్లలో ఉంటుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ఒంటిగంట 30 నిమిషాల వరకు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్- అటె స్టెడ్ ఫోటో కాపీలు, రెండు సెట్ల అటె స్టేషన్ ఫామ్ లతోపాటు చెక్‌ లిస్టును కూడా తప్పనిసరిగా తీసుకురావాలని కమిషన్ స్పష్టం చేసింది.

ఈ మేరకు జూన్ 17 నుంచి జూలై 9 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్‌ ను ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మిగిలిన వివరాల కోసం అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ను సందర్శించాలని కమిషన్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+