ఇంటికే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు - ఎలా పొందాలి..!!

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ప్రతీ ఏటా వైభవంగా నిర్వహిస్తారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ సారి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. కల్యాణం - మహా పట్టాభిషేకం ఉత్సవాలను ఆన్ లైన్ టికెట్లు అందుబాటులోకి తీసుకొ చ్చారు. ఇదే సమయంలో ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు పొందే వెసులు బాటు కల్పించారు. ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

కళ్యాణ వేడక
భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు ప్రతీ ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. కల్యాణ తలంబ్రాలకు విశిష్ఠత ఉంది. ఈ సారి భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్‌ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచారు. స్వామి వారి కల్యా ణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది 300 క్వింటాళ్లకు పైగా తలంబ్రాలు సిద్ధం చేసి భక్తులకు అందజేయాలనే లక్ష్యలతో దేవస్థానం అధికారులు చేశారు. ఇందులో భాగం గా 25 క్వింటాళ్ల తలంబ్రాలను ముత్తెదువుల సమక్షంలో భక్తులతో కలిసి తయారు చేస్తున్నారు.

tgsrtc-and-endowments-decided-to-deliver-bhadradri-talambralu-to-devotees-door-step

భద్రాద్రి ఉత్సవాలు
ఈ నెల 30న శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలంలో ప్రారంభం కానున్నాయి. కాగా, ఏప్రిల్‌ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాధివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, 5న ఎదుర్కోలు, 6న కల్యాణం, 7న పట్టాభిషేకం, 8న సదస్యం, 12న చక్రతీర్థం ఉత్సవాలు జరుపుతారు. ఇక, మే 22న హనుమజ్జయంతి జరుగనుంది. భద్రాచలం స్వయంగా వెళ్లలేని భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు అందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ - టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు రామయ్య తలం బ్రాలను నేరుగా వారి ఇంటికే చేర్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. తలంబ్రాల బుకింగ్ విధానం గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. బుకింగ్ పోస్టర్ ఆవిష్కరించారు.

హోం డెలివరీ
భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత బుకింగ్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలు హోం డెలివరీ చేస్తారు. రాములోరి తలంబ్రాలు కావాలని కోరుకునే భక్తులు టీజీ ఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలు లేదా సంస్థ వెబ్‌సైట్‌ tgsrtclogistics.co.in ఓపెన్ చేసి రూ.151 చెల్లించి మీ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. భక్తులు సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిన అయినా నేరుగా ఆర్డర్ చేయవచ్చు. భక్తులు తలంబ్రాల సేవ పొందాలనుకుంటే టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నెంబర్లు 040-69440000, 040-69440069లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+