గణేశ్ నిమజ్జనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - రూట్లు, దారి మళ్లింపు..!!
గణేశ్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్దం అవుతోంది. జీహెచ్ఎంసీ.. పోలీసు శాఖ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం వేళ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్దమైంది. నిమజ్జనం పూర్తి అయ్యే వరకు అదనపు సిబ్బందిని మొహరించింది. 15 వేల మంది సిబ్బంది జీహెచ్ఎంసీ తరఫున నిమజ్జనం విధులు నిర్వహించనున్నారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు 20 చెరువులు, 72 కృతిమ కొలనుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించారు.
గణేశ్ నిజమజ్జనం వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్, చార్మినార్ డివిజిన్ పరిధిలోని బర్కత్ పురా, ముషీరాబాద్, ఫలక్‌నూమా, కాచిగూడ, మెహదీ పట్నం, రాజేంద్రనగర్ డిపోల తో పాటుగా హయత్ నగర్ పరిధిలోని దిల్ షుక్ నగర్, హయత్ నగర్ -1, 2, మిథాని డిపోల నుంచి నిమజ్జనం కోసం బస్సులను నడపాలని నిర్ణయించారు. ఆయా డిపోలకు చెందిన 43 మంది డ్రైవర్లు, మెకానిక్‌లను ముగ్గురు ఏసీపీలు, నాలుగు పోలీస్‌స్టేషన్లకు అప్పగించనున్నారు. నిమజ్జనం ఊరేగింపులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగేలా వీరిని అందుబాటులో ఉంచుతున్నారు.

కాచిగూడ, రాంనగర్ నుంచి బషీర్‌బాగ్ వరకు, కొత్తపేట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మిథాని నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్, గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేంద్రనగర్ నుంచి లక్డీకాపూల్, పటాన్‌చెరు నుంచి లింగంపల్లి, ఆఫ్జల్‌గంజ్ నుంచి ఆలిండియా రేడియో వరకు బస్సుల రాకపోకలు సాగుతాయని అధికారులు వెల్లడించారు. అదే విధంగా నిమజ్జనం వేళ వాహనాలను పోలీసులు అనుమతించారు. ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సులభంగా సాగించేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.15 వేల మంది సిబ్బంది జీహెచ్ఎంసీ తరఫున నిమజ్జనం విధులు నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్‌తో పాటు 20 చెరువులు, 72 కృతిమ కొలనుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించారు.












Click it and Unblock the Notifications