తెలంగాణ ఆర్టీసీ మరో కీలకనిర్ణయం.. మెట్రో రైళ్ళ తరహాలో బస్సుల్లో కూడా..!

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. టికెట్‌ రహిత ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణా ఆర్టీసీ మెట్రో రైలు తరహాలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో డిజిటల్‌ స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. రూట్‌వేవ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హయత్‌నగర్‌-2 డిపోకు చెందిన పది ఎలక్ట్రిక్‌ బస్సుల్లో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది.

డిజిటల్ స్క్రీన్స్ పై ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయానికి ప్లాన్

ఈ డిజిటల్‌ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్‌ స్టాప్‌ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలు తరహాలోనే ముందుగా స్టేజీల పేర్లు చూపించడం వల్ల నగరానికి కొత్తగా వచ్చినవారు, మార్గాలు తెలియని ప్రయాణికులు సులభంగా గమ్యస్థానం వద్ద దిగగలుగుతారు.

TGSRTC another decision like metro rtc installs digital screens in 10 electric buses at Hayathnagar

ఒక ఆలోచనతో మూడు ప్రయోజనాలు

అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు పైలట్‌ ప్రాజెక్టు కోసం హయత్‌నగర్‌-పటాన్‌చెరు రద్దీ మార్గాన్ని ఎంపిక చేశారు. పది బస్సుల్లో ఇప్పటికే స్క్రీన్లు అమర్చారు.

హయత్ నగర్ పటాన్ చెరు రూట్ లో పైలట్ ప్రాజెక్ట్

ప్రయాణికుల స్పందన, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సాంకేతిక పనితీరును పరిశీలించిన తర్వాత నగరంలోని ఇతర డిపోల ఎలక్ట్రిక్‌ బస్సులకు కూడా ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. గతంలో డిజిటల్‌ స్క్రీన్లు ప్రధానంగా వినోదం, ప్రకటనలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్‌ సదుపాయాలు జోడించి ప్రయాణికులకు ఉపయోగపడే సమాచార వేదికగా మారుస్తున్నారు.

ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!
ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని బస్సుల్లోనూ డిజిటల్ స్క్రీన్స్

ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ప్రజా సమాచార కేంద్రాలుగా కూడా ఉపయోగించాలని ఆర్టీసీ భావిస్తోంది. దీని వల్ల ప్రయాణ అనుభవం మెరుగవడంతో పాటు సంస్థకు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. మరి ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులలో ఈ సదుపాయం కల్పించే ఆలోచనలో ఉంది తెలంగాణా ఆర్టీసీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+