ఆర్టీసీ సమ్మె వేళ అనూహ్య పరిణామాలు - హెచ్చరికలు..!!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అర్ద్రరాత్రి నుంచి సమ్మె ప్రారంభం అయితే దాదాపు ఆరు వేల బస్సులు నిలిచిపోనున్నాయి. మంత్రి పొన్నం తో సంఘాల నేతల భేటీ అయ్యారు. చర్చలతోనే సమస్యల పరిష్కారం వస్తుందని సూచన చేసా రు. మరో వైపు సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. కాగా, తమ సంఘం కార్మికులు విధులకు వస్తారని టీఎంయూ నాయకుడు అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ఇటు జేఏసీ సమ్మె యథాతథమని స్పష్టం చేసారు. వందల మంది ఆర్టీసీ కార్మికులు కవాతు చేసారు. దీంతో, సమ్మె వేళ చివరి నిమిషంలో జరిగే పరిణామాల పై ఉత్కంఠ కొనసాగుతోంది.

చర్చలు - సన్నాహకాలు
తెలంగాణ ఆర్టీసీలో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. సమ్మె వద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో పలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించాయి. సమ్మె వద్దని ప్రభుత్వం చెబుతుండగా, చేసి తీరుతామని జేఏసీ నేతలు పట్టుబడ్టారు. మరోవైపు.. సమ్మె కట్టడి చర్యల్లో భాగంగా సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది.

tgsrtc-clarifies-on-esma-act-ahead-employees-jac-strike

ప్రభుత్వంతో చర్చలు
సమస్యలపై జేఏసీ చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పలు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం మంత్రి మట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు విని, పరిష్కరించేందుకు తనతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమ, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. 16 నెలల్లో ఆర్టీసీకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్‌ మొత్తం రూ. 400 కోట్లు చెల్లించామని చెప్పారు. పీఎఫ్‌ ఆర్టీనైజేసన్‌ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ. 1039 కోట్లు చెల్లించామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొత్తగా 3038 ఉద్యోగాల భర్తీ చేశామని చెప్పారు. సమ్మెకు పట్టుబడకుండా చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Take a Poll

ఎస్మా హెచ్చరిక
సమ్మె మొదలైతే ఎస్మా తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. ఎస్మా చట్ట ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని యాజమాన్యం ప్రకటించింది. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైనదని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. సమ్మె వల్ల సంస్థకు నష్టం వాటిల్లుతుందని, ఒక వర్గం తమ మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతోపాటు ఉద్యోగులకు నష్టం జరుగుతుంద న్న విషయం మర్చిపోవద్దని సూచించింది. దీంతో, ఈ రాత్రి వరకు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+