ఉచిత బస్సు ప్రయాణం కష్టాలకు చెక్, ఆర్టీసీ కీలక నిర్ణయం - కొత్తగా ఇక..!!
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మ కం గా అమలు చేస్తోంది. నిరంతరం ప్రయాణీకుల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తోంది. ఇదే సమయం లో ఈ పథకం అమలులో సమస్యల పైన ఫోకస్ చేసింది. మరిన్ని సర్వీసులను ఈ పథకం పరిధి లోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఇక.. ఆర్టీసీ సేవల విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోంది. అందు లో భాగంగా.. ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది.
మహాలక్ష్మీ పథకం అమలు ద్వారా తెలంగాణలో ఆర్టీసీకి ఆదరణ పెరిగింది. పథకం నిర్వహణ ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకం కింద ప్రభుత్వం ప్రతీ నెలా రీ యంబర్స్ మెంట్ చేస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ నగరంతో పాటుగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ బస్సుల ను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిల్లోనూ ఎంపిక చేసిన సర్వీసుల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రయాణాల్లో కొన్నిసార్లు డ్రైవర్లు, కండక్టర్ల నుంచి దురుసుగా మాట్లాడటం, పరుష పదజాలంతో మాట్లాడటం చూస్తూ ఉంటాం. వీటిపై అనేకసార్లు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై యాజమాన్యం స్పందించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త క్రమశిక్షణ దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగుల సేవల విషయంపైనా దృష్టి పెట్టింది.

తెలంగాణ ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 9000 బస్సులు ఉన్నాయి. అవి రోజూ 42 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. ఇలా సగటున 58 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగుతున్న వేళ..వారితో స్నేహపూర్వకంగా, మర్యాదగా వ్యవహరించాలి. వారి మనసు నొప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని.. ఫిర్యాదులు రావొద్దని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక.. ఇదే సమయంలో రాష్ట్రంలో రెండు చోట్ల కొత్తగా బస్ డిపోలు, పలు ప్రాంతాల్లో ఆధునిక బస్‌డిపోల నిర్మాణంతో పాటు పాత బస్ స్టేషన్ల పునర్నిర్మాణం, ఆధునికీకరణ, విస్తరణ పనులపై ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకు రాష్ట్రంలో 39 ప్రాంతాల్లో రూ.209.44 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ పనులకు సంబంధించి 8 చోట్ల టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది.












Click it and Unblock the Notifications