ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!
TGSRTC లో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు నోటీసు ఇచ్చారు. ఈ రోజున ఈ సమ్మె విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు హెచ్చరించారు. దీంతో.. ఈ సాయంత్రం లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు భేటీ అవుతున్నారు. సమ్మె, తమ డిమాండ్లపై అధికారులతో చర్చించనున్నారు. అధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి సమ్మెపై ప్రకటన రానుంది.
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు లేబర్ కమిషనర్‌తో భేటీ కానుండటం రాజకీయంగా, పాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు ప్రాథమికంగా నిర్ణయించాయి. కార్మికులు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలకు పిలవకపోవడంపై జేఏసీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లేబర్ కమిషనర్‌తో జరిగే చర్చల అనంతరం సమ్మెపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు కార్మికుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

అధికారులతో చర్చలు.. సమ్మె పై నిర్ణయం
కాగా, లేబర్ ఆఫీస్ వద్దకు కార్మికులందరూ చేరుకోవాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లపై గళమెత్తాలని కార్మికులకు సూచించింది. కార్మికులందరూ ఏకం కావాలని పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల వేతనాలు, సర్వీస్ సమస్యలు, బెనిఫిట్స్ వంటి అంశాలపై దీర్ఘ కాలంగా అసంతృప్తితో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ఆందోళన తీవ్రత పెరుగుతోంది. ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ స్పందన ఇవ్వకపోతే సమ్మె తప్పదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్చి 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సమ్మెకు వెళ్లాల్సి వస్తే దాని బాధ్యత ప్రభుత్వానిదేనని జేఏసీ నాయకులు హెచ్చరించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఈ దశకు చేరిందని వారు పేర్కొన్నారు. దీంతో, ఈ చర్చలు సఫలమవుతాయా లేదా సమ్మెకు దారి తీస్తాయా అన్నది ఈ రోజు స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications