Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Thailand job scam : థాయ్‌లాండ్ ఉద్యోగ మోసంలో చిక్కుకున్న హైదరాబాద్ యువకులు

మంచి చదువులు చదివారు..అయితే ఉద్యోగాలు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం మాత్రం రావడం లేదు. ఫలానా ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ పై కూడా పట్టు సాధించారు. కానీ చివరకు యువతకు నిరుత్సాహమే మిగిలింది. అదే సమయంలో ఒక బంపర్ ఆఫర్ అంటూ ఒక కంపెనీ ముందుకొచ్చింది. లక్షల్లో జీతాలు.ఇంకేముంది ఈ నిరుద్యోగులకు ఇది ఒక డ్రీమ్ జాబ్‌లా కనిపించింది. వెంటనే ఫ్లయిట్ ఎక్కేశారు..బ్యాంకాక్‌లో ల్యాండ్ అయ్యారు.. కట్ చేస్తే కష్టాల్లో కూరుకుపోయారు. ఇంతకీ ఏం జరిగింది..?

మంచి మంచి చదువులు చదివి జీవితంలో స్థిరపడాలని కలలు కనే యువత కష్టాలు పాలవుతోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నించి ప్రయత్నించి చెప్పులరిగేలా కంపెనీల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయింది నేటి యువత. ఫలానా ఉద్యోగం కోసం కావాల్సిన స్కిల్స్‌ నేర్చుకునేందుకు వేలల్లో ఫీజులు కట్టి నేర్చుకుంటున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. దీంతో ఏ ఉద్యోగం వచ్చినా ఇట్టే వాలిపోతున్నారు. ఆ పై కష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాదుకు చెందిన ఓ యువకుడి కష్టాల కడలి వెలుగులోకి వచ్చింది. హైదరాబాదు కట్టల్ గుడా ప్రాంతంలో నివాసముంటున్న మీర్ సజ్జద్ అలీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చాలా చేశాడు. అయితే జాబ్ రాలేదు. ఉద్యోగం రాలేదని ఆవేదనతో ఉన్న సజ్జద్‌కు అనుకోకుండా ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది.

thailand-job-scam-hyderabad-youth-trapped-after-dream-job-offer-here-is-his-ordeal-how-he-reached

థాయ్‌లాండ్ జాబ్ స్కామ్

డిజిటల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం ఉందని, రోజుకు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుందని నెలకు రూ.లక్ష జీతం ఇస్తామంటూ అవతలి వ్యక్తి ఫోన్‌లో చెప్పాడు. అంతేకాదు వీడియోకాల్ చేసి తాను పనిచేసే ప్రాంతం కూడా చూపించాడు. అదొక విల్లా. ఇది చూసిన సజ్జద్ వెంటనే ఆఫర్‌కు ఒప్పేసుకున్నాడు. అయితే ఆ ఉద్యోగం బ్యాంకాక్‌లో అని అవతలి వైపు నుంచి వచ్చేసరికి.. ఫర్వాలేదు లక్ష రూపాయలు జీతం కదా అని వెంటనే ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడు. దీంతో గతేడాది నవంబర్‌లో బ్యాంకాక్‌కు విమానం ఎక్కేశాడు. అయితే వారి తల్లిదండ్రులకు హాలిడేపై వెళ్తున్నట్లు చెప్పాడు. అసలు విషయం దాచాడు.

ఇక బ్యాంకాక్‌లో ల్యాండ్ అయ్యాక తన తల్లికి ఫోన్ చేశాడు. తనకు బ్యాంకాక్‌లో ఉద్యోగం వచ్చిందని.. జీతం రూ. లక్ష అని చెప్పడంతో తల్లి కూడా సంతోషం వ్యక్తం చేసింది. కానీ బ్యాంకాక్ అని చెప్పడంతో ముందు కాస్త ఆందోళన చెందినప్పటికీ... కొడుకు బాగుపడుతుంటే మంచిదేగా అని అనుకుంది. ఇలా వరుసగా పది రోజుల పాటు వీడియో కాల్ చేసి తల్లితో మాట్లాడేవాడు. ఇక ఆ తర్వాత ఫోన్ కాల్స్ లేవు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి వరకు బ్యాంకాక్‌లోని ఓ విల్లాలో ఉన్న అతన్ని బ్యాంకాక్-మయన్మార్ సరిహద్దులోకి తరలించారు. అక్కడే చాలామంది కిక్కిరిసి ఉన్న డెన్‌లో బంధించి పనిచేయమన్నారు. మాట వినకపోతే చిత్రహింసలకు గురిచేసేవారు. జనవరి 16వ తేదీన ఎవరికీ తెలియకుండా తల్లికి ఫోన్ చేసి తాను మోసపోయానని వెంటనే రక్షించాల్సిందిగా కన్నీరుమున్నీరయ్యాడు.

ఎంపీ అసదుద్దీన్ చొరవతో...

సజ్జద్ అనుభవిస్తున్న చిత్రహింసలు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ దృష్టికి వచ్చింది. దేశవ్యాప్తంగా 16 మంది యువకులను థాయ్‌లాండ్‌లో బంధించారని అందులో ముగ్గురు యువకులు హైదరాబాద్ వాసులన్నారని వెంటనే వారిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకొచ్చారు. వారు అనుభవిస్తున్న నరకయాతనను వివరించారు. వారిని కొడుతున్నారని, పాస్‌పోర్టులు, ఫోన్లు లాగేసుకున్నట్లు వెల్లడించారు. సజ్జద్‌తో పాటు మౌలాలికి చెందిన సమీర్ ఖాన్,బంజారా హిల్స్‌కు చెందిన అర్షద్‌లు ఉన్నట్లు అసదుద్దీన్ పేర్కొన్నారు. ఈ రాకెట్‌లో బాధితులుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నట్లు సమాచారం.

బాధితులను కాపాడిన ఏపీ పోలీసులు
బాధితులు కొందరు ప్రభుత్వాల సహాయంతో తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను వివరించారు. ఉద్యోగాల పేరిట యువతను ట్రాప్ చేసి అక్కడ చిత్రహింసలకు గురిచేస్తుంటారని చెప్పారు.వారితో సైబర్ నేరాలు చేయిస్తుంటారని, ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకపోతే వారిని తిట్టడమే కాకుండా కొడుతుంటారని వెల్లడించారు.ఇదే విషయాన్ని ఏపీ సీఐడీ అధికారి ఒకరు ధృవీకరించారు. గత నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో 370 మందిని రక్షించింది. ఇందులో 55 మంది ఏపీకి చెందిన బాధితులున్నారు. వీరందరిని థాయ్‌లాండ్-మియన్మార్ సరిహద్దుల నుంచి కాపాడి మూడు విమానాల్లో సొంత రాష్ట్రాలకు తరలించారు. జనవరి రెండవ వారంలో థాయ్‌లాండ్ పోలీసుల సహకారంతో మరో 22 మందిని కాపాడినట్లు ఏపీ సీఐడీ డైజీ డాక్టర్ రవిశంకర్ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+