వాహ్.!ఏం లేపారు సర్.!ఆకాశమే హద్దుగా ఎత్తేసారుగా.!అదీ బీఆర్ఎస్-బీజేపి బంధం.! కాంగ్రెస్ ఎద్దేవా.!
హైదరాబాద్ : బీజేపి-బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న ఉత్కంఠ రాజకీయాల పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ రెండు పరస్పర అవగాహనతో నవరసాలు పండిస్తున్నాయని, పేపర్ లీకేజ్ వ్యవహారాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపి-బీఆర్ఎస్ పార్టీలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయని, ఈ వ్యవహారాన్ని ప్రజలందరూ సునిశితంగా గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
అంతే కాకుండా ఏ చిన్న విషయాన్నైనా ఈ రెంబడు పార్టీలు అంతర్గతంగా చర్చించుకుని కార్యాచరణకు పూనుకుంటున్నాయన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి తమ కార్యాలయంలోకి పిలుపించుకుని విచారించిన అధికారులు బండి సంజయ్ ని ఎందుకు పిలుపించుకుని ఆధారాలు సేకరించలేదని ప్రశ్నించారు.

అంతే కాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాత్ సే హాత్ జోడే యాత్ర, ప్రజా సమస్యలపై పోరాటం వంటి కార్యక్రమాలకు ప్రజల నుండి ఊహించని ఆధరణ వస్తుండడంతో, కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు మహేష్ కుమార్ గౌడ్. అందులో భాగంగానే ప్రజా పోరాటంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం లేకుండా చేయాలన్నదే గులాబీ ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీని తొక్కేసి బీజేపికి ప్రజాధరణ కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ టిర్గెట్ అన్నారు. బండి సంజయ్ అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు గతంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో ఇదే జరిగిందని, మళ్లీ ప్రస్తుతం ఇదే పునరావృతం అవుతోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పార్టీని ఎంత తొక్కాలని ప్రయత్నం చేస్తే అంత పైపైకి వస్తుందన్నారు మహేష్ కుమార్ గౌడ్.












Click it and Unblock the Notifications