ఇక సొంతంగా కరోనా టెస్ట్ నిర్వహించుకునే వెసులు బాటు.!ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు.!
హైదరాబాద్ : కరోనా టెస్టుల కోసం ఆసుపత్రుల వద్ద, పరీక్షా కేంద్రాల వద్ద వందల మంది క్యూలు కట్టడం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ పదుల సంఖ్యలోనే టోకెన్లు జారీ చేస్తున్నారు టెస్టుల నిర్వాహకులు. టెస్టు తమ వరకూ రాదేమోనని జనం ఎగబడిపోవడం కూడా చూస్తున్నాం. టెస్టులకోసమని వెళ్తే మహమ్మారి ఎక్కడ అంటుకుంటుందోననే భయంతో వణికిపోవడం కూడా జరుగుతోంది. ఒక్క పరీక్ష చేయించుకోవడానికి జనం అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. ఆ తిప్పలు పోగొట్టేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఓ బృహత్కర కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

కరోనా లక్షణాలున్న వారికి ఊరట.. టెస్టులు ఇంట్లోనే చేసుకునే వెసులుబాటు..
దీంతో ఇంతకాలం కరోనా పరీక్ష కోసం వెళ్లి క్యూలైన్ లో నుంచోని, గంటలు గంటులు ఎదురు చూసిన సంఘటనలనుండి బయటపడొచ్చు. ఐసీఎంఆర్ చొరవతో ఇంట్లోనే మనకు మనమే కరోనా వైరస్ టెస్ట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మహారాష్ట్రలోని మైల్యాబ్ అనే సంస్థ తయారు చేసిన కొవిసెల్ఫ్ అనే స్వీయ ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ కు అనుమతులు కూడా లభించాయి. దీంతో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇంట్లోనే టెస్టు చేసెుకోవచ్చు. అందుకు ఐసీఎంఆర్ ప్రతిపాదించిన మార్గదర్శకాలను ఒకసారి తెలుసుకుందాం.

ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇవే. పాటిస్తే ఎంతో మేలు..
1)కరోనా లక్షణాలున్న వారు లేదా కరోనా సోకిన వారిని కలిసిన వారు మాత్రమే టెస్ట్ చేసుకోవాలి. 2)టెస్టులను ఇష్టమొచ్చినట్టు చేయొద్దు. 3)సంస్థ టెస్ట్ కిట్ లోని యూజర్ మాన్యువల్ లో నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పరీక్ష చేసుకోవాలి. 4)టెస్టులు చేసుకునేవారంతా గూగుల్ ప్లే స్టోర్ నుంచి హోం టెస్టింగ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 5)పరీక్షా పద్ధతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ యాప్ లో ఉంటాయి. 6)అంతేగాకుండా పరీక్ష ఫలితాలు (నెగెటివ్/పాజిటివ్) అందులోనే తెలుసుకోవచ్చు. 7)టెస్ట్ పూర్తయిన తర్వాత.. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న, టెస్ట్ చేసుకున్న వ్యక్తి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ లోనే ఆ టెస్ట్ పేపర్ ను ఒక ఫొటో తీసుకోవాలి.

ఉపయోగకరంగా ఐసీఎంఆర్ మార్గదర్శకాలు.. పాటిస్తే ఫలితం ఉంటుందంటున్న వైద్యులు..
8)టెస్ట్ లో పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు.. ఒకవేళ లక్షణాలుండి నెగెటివ్ వస్తే కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. 9)పాజిటివ్ వచ్చి.. లక్షణాలు తక్కువగా ఉన్నవారు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గనిర్దేశాల ప్రకారం ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలి. 10)లక్షణాలుండి యాంటీ జెన్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చిన వారిని కరోనా అనుమానిత పేషెంట్ గానే భావించాలి. అలాంటి వారు ఇంట్లో ఐసోలేట్ అవ్వాలి. 11)యాప్ లోని యూజర్ వివరాలు ఐసీఎంఆర్ కొవిడ్ 19 టెస్టింగ్ పోర్టల్ లో భద్రంగా దాస్తారు.
12)టెస్ట్ అయిపోయిన తర్వాత సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆ కిట్ ను భద్రంగా పారేయాలి.

టెస్టు చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. గైడ్ లైన్స్ చదివాకే టెస్టు చేసుకోవాలన్న ఐసీఎంఆర్
కాగా ఐసీఎంఆర్ సూచించి మార్గదర్శకాలను పాటిస్తూ ఇంట్లోనే కరోనా పరీక్షలు నిర్వహించుకుంటే ఎలాంటి ఆందోళన ఉండదని తెలుస్తోంది. కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కరోనా లక్షణలతో బాధపడేవారు టెస్టుల కోసం బయటకు వస్తే మరింత ప్రమాదానకి గురయ్యే అవకాశాలు లేకపోలేదని వైద్యులు నిర్దారిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఐసీఎంఆర్ రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా నిర్దారణ పరీక్షలను ఇంట్లోనే నిర్వహించుకుని తగు చికిత్స చేసుకుంటే కరోనాను తరిమికొట్టొచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications