వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోంది; పీకే వ్యూహాలపై జంకు దేనికి: గుత్తా సుఖేందర్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ గవర్నర్ మహిళ కాబట్టి ఆమెను బడ్జెట్ సమావేశాలలో ప్రసంగించకుండా అవమానిస్తున్నారని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి నేతలపై, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బిజెపి నాయకులు వ్యాఖ్యలు చేయడం అవగాహనారాహిత్యం అని ఆయన మండిపడ్డారు.

మహిళలను అవమానించింది బీజేపీనే, ముందు పార్టీలో అసమ్మతి చూసుకో: బండికి మంత్రి హరీష్ రావు కౌంటర్మహిళలను అవమానించింది బీజేపీనే, ముందు పార్టీలో అసమ్మతి చూసుకో: బండికి మంత్రి హరీష్ రావు కౌంటర్

బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోంది

బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోంది


బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి బిజెపి ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపణలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు తరచూ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు లేరని, కాంగ్రెస్ పార్టీలో రోజు తన్నులాట కొనసాగుతుందని పేర్కొన్నారు.

బీజేపీ కుటిల యత్నాలు తిప్పి కొడతాం

బీజేపీ కుటిల యత్నాలు తిప్పి కొడతాం

శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. సమావేశాలకు గవర్నర్ ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు శాసనసభ ప్రోరోగ్ గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బిజెపి కుటిల యత్నాలు తిప్పికొడతామని, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.ఉత్తరప్రదేశ్లో అధికార దాహం తప్ప వేరే ఆలోచన బిజెపికి లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుడు లేని నావ .. బీజేపీ, కాంగ్రస్ లు అధికారంలోకి ఎలా వస్తారు?

కాంగ్రెస్ నాయకుడు లేని నావ .. బీజేపీ, కాంగ్రస్ లు అధికారంలోకి ఎలా వస్తారు?


2023 లో అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎలా చెబుతారని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేని నావలాగా సాగుతోందని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎటు కొట్టుకు పోతుందో వారికే తెలియదంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఇక ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై జంకు దేనికి

ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై జంకు దేనికి


తమిళనాడులో బిజెపికి ఘోరపరాభవం జరిగిందని గుర్తు సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ దేశంలో నికృష్ట విధానాలను అమలు చేస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత బిజెపి నాయకులకు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారని గుర్తు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై జంకు ఎందుకు అంటూ ప్రశ్నించారు.

English summary
Former Legislative Council chairman MLC Gutta Sukhender Reddy was outraged that the Center was using the governor system as a party. Gutta questioned what was the fear on PK tactics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X