Telangana: మే 27న సెలవు ఇవ్వండి.. ఎందుకంటే..!

మే 27న సెలవు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆ రోజు వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉందని బీజేపీ పేర్కొంది. పట్టభద్రులు ఓటు వేయాలంటే ఆ రోజు సెలవు ప్రటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ ఎన్నిక కోసం 4.69 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు.

వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని కోరారు. దీనిపై ఎన్నికల సంఘం నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పోలింగ్ రోజు దాదాపు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలింగ్ జరిగే జిల్లాల్లో మాత్రమే హాలిడే ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

The BJP has asked for a holiday on May 27 the polling date for the number of graduates

ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందులో గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపిపించుకునేందుకు నాయకులు పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ లు, అసెంబ్లీ నియోజక వర్గ ఇన్‌ఛార్జ్ లు, కో-ఆర్డినేటర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. కాగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీదే అయినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకే మొగ్గు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+