సికింద్రాబాద్, మహబుబ్‌నగర్ లోక్‌సభ స్థానాలు బీజేపీకే స్వంతం..యడ్యూరప్ప
కేంద్రంలో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పాడు కర్ణాటక మాజీ సీఎం యడ్యురప్ప. వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించిన యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, మహబూబ్ నగర్ లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈనేపథ్యంలోనే బీజేపీ 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని చెప్పారు. దీంతోపాటు కర్నాటకలో బీజేపీకి 20-22 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించారు. . కర్నాటకలో త్వరలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని...అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టంచేశారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీ ఓటమి తర్వాత ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. టీఆర్ఎస్‌ని ఓడించడం తోపాటు కనీసం సీట్లను తెచ్చుకోవడమే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈనేపథ్యంలో సికింద్రాబాద్ లోని ప్రస్థుత ఎంపీ దత్తాత్రేయను కాదని మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని రంగంలోకి దింపింది. మరోవైపు మహబుబ్ నగర్ లో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణకు పార్టీ మారిన
వెంటే సీటు కేటాయించింది. దీంతో ఆ సీట్లను గెలుచుకునేందుకు .బీజేపీ అగ్రనేతలతో ప్రచారం నిర్వహించింది. మొత్తం 17 స్థానాల్లో సికింద్రాబాద్ తోపాటు మహబుబ్ నగర్, కరీంనగర్ స్థానాలపై భారీ ఆశలు పెట్టుకుంది బీజేపీ రాష్ట్ర్ర నాయకత్వం












Click it and Unblock the Notifications