వైరల్ వీడియో.. పెళ్ళిపీటలపైనే వందేమాతరం గీతాలాపన చేసిన వధూవరులు!

వందేమాతర గీతాలాపనతో ఈరోజు దేశమంతా ఒక్కసారిగా తమ ప్రగాఢమైన దేశభక్తిని చాటుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన 'వందేమాతరం' గేయానికి ఈరోజుతో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్‌ స్టేడియంలో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. సామూహిక గేయాలాపనలో ప్రధానమంత్రి కూడా పాల్గొని పాడారు.

దేశమంతా సామూహిక వందేమాతర గేయాలాపన
వందేమాతర గీతాలాపన అనంతరం స్మారక స్టాంపును, నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. అలాగే, రాష్ట్రమంతా నేడు వందేమాతర గేయాన్ని ఆలపించింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, అన్ని విద్యామందిరాల్లో సామూహిక వందేమాతర గేయాలాపన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయోద్యమ మహనీయులకు ఘన నివాళులర్పించారు. వందేమాతరం.. జాతీయ గీతం స్ఫూర్తిగా, సమైక్యతా భావంతో దేశ అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

The bride and groom sang VandeMataram on their wedding

పెళ్లి వేడుకలో వందేమాతరం గీతాలాపన
కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సామూహిక వందేమాతర గీతాలాపన ప్రజలందరిలోనూ దేశభక్తిని ప్రేరేపించింది. వాడ వాడలా ప్రజలు, విద్యార్థులు, విభిన్న వర్గాలవారు నేడు వందేమాతర గీతాలాపన చేశారు. వరంగల్ నగరంలోని ఒక వివాహ వేడుకలోనూ వందేమాతర గీతాలాపన ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చింది.

పెళ్లి పీటల మీదే వధూవరుల వందేమాతరం గీతాలాపన
వరంగల్ నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్, లక్ష్మిసాయి ల వివాహం నేడు జరిగింది. ఈ క్రమంలో వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వివాహ వేడుకలో సామూహిక వందేమాతర గీతాలాపన చేసి దేశభక్తిని చాటారు. పెళ్లి పీటల పై నుండి లేచిన వధూవరులు జాతీయ జెండా పట్టుకుని వందేమాతరం గానం చేశారు.

వివాహ వేడుకలోనూ దేశభక్తిని నింపిన వందేమాతరం
ప్రతీ ఒక్కరు హక్కులను పొందినట్లే ప్రాథమిక విధులను అదేశిక సూత్రాలను పాటించాలనే ఉద్దేశ్యంతోనే వివాహ వేడుకల్లో వందేమాతరం పాడించామని పెళ్ళిపెద్దలు తెలిపారు. జాతీయ జెండాను చేత పట్టుకున్న వధూవరుల సైతం పెళ్లి పీటల మీదనే వందేమాతర గీతాలాపన చేశారు. వివాహ వేడుకల్లో దేశభక్తితో చేపట్టిన కార్యక్రమం పట్ల పలువురు అధికారులు, ప్రముఖులు అభినందలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+