Outer Ring Rail: తెలంగాణ శుభవార్త చెప్పిన కేంద్రం.. హైదరాబాద్ చుట్టూ ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టు..
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ చుట్టూ కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు అని కిషన్ రెడ్డి తెలిపారు. ఔటర రింగ్ రైలు ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే శాఖ రూ.14 వేల కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందుతుందని కిషన్ రెడ్డి అన్నారు. రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కూడా ఈ ఔటర్ రింగ్ రైలు ద్వారా కనెక్టివిటీ పెరుగుందని చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును రూ.26 వేల కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. భూసేకరణకు సంబంధించి 50 శాథం ఖర్చు కేంద్రమే భరిస్తుందన్నారు.

ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు సంబంధించిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందించినట్లు వివరించారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని.. రూట్ ఎలా ఉండాలనే దానికి 99శాతం ఆమోదం లభించిందని చెప్పుకొచ్చారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు రీజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూ సేకరణ సర్వే చేస్తున్నారు.
రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ పూర్తైనట్లు అధికారుల తెలిపారు. భూములిచ్చేది లేదంటూ రైతులు భీష్మించటంతో సంగారెడ్డి, రాయగిరి ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కూడా అధికారులు సర్వే పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ ప్రకారం హద్దులు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications