అఖిలపక్షానికి బీఆర్ఎస్, బీజేపీ దూరం.. భట్టి ఏమన్నారంటే?

కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి ప్రతిపక్షబీఆర్ఎస్ తోపాటు బీజేపీ ఎంపీలు దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలతో ప్రజాభవన్‌లో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో ఏయే అంశాలు లేవనెత్తాలనే విషయాలపై చర్చించి వివరంగా బుక్‌లెట్ తయారు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పదేళ్లు బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.

The Center should be held accountable for funds DCM Bhatti Vikramarka at the all-party meeting

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన సహా అనేక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అంతట్లేదన్నారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా అవసరమైతే పార్లమెంట్ సమావేశాల్లో అడ్జెయిన్మెంట్ మోషన్ ఇచ్చే అవకాశాలను ఎంపీలకు వివరించామని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రావాలని కోరితే బీజేపీ ఎంపీలు తమకు సమయం లేదని చెప్పారని డిప్యటీ సీఎం తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని అన్నారు. అందుకే, అఖిలపక్ష సమావేశానికి రాని ఎంపీలకు బుక్‌లెట్ అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. అవసరమైతే మరోసారి భేటీ నిర్వహించేందుకైనా సిద్ధమేనని చెప్పారు.

మరోవైపు, ఈ సమావేశానికి హాజరైన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, కేంద్రం పారదర్శకంగా లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు అడిగినా మంజూరు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా.. మోడీ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+