జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం దిమ్మతిరిగే షాక్!
తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం హోరా హోరీగా పోరు కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో అన్ని రాజకీయ పార్టీలు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ తమ పార్టీని ఆదరించాలని ఎవరికివారు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. తమదైన పందాలో ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతున్నారు.
ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు
సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్న క్రమంలో ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియాను ప్రధాన వాహికగా వాడుతున్నారు. ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాకుండా, బీహార్, జమ్మూ కాశ్మీర్ తో పాటు ఐదు రాష్ట్రాలలోని ఎనిమిది సెగ్మెంట్లలో ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ప్రతి ప్రకటనకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి
ఎన్నికలు జరిగే ప్రతి చోట ఎన్నికల ప్రచారంలో పారదర్శకతను పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రతి ప్రకటనకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రకటనల కంటెంట్ ను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఎన్నికలు ముగిసిన 75 రోజులలోగా సమర్పించాలి
ఈ కమిటీల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత పార్టీలు, అభ్యర్థులు తమ ప్రకటనలను ప్రసారం చేయవలసి ఉంటుంది. నిబంధన కేవలం ప్రకటనలకే పరిమితం కాదు. నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థులు, పార్టీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, అంతేకాకుండా ప్రకటనల రూపకల్పన కోసం ఆయన ఖర్చుతో సహా ప్రచారానికి సంబంధించిన పూర్తి వ్యయ వివరాలను ఎన్నికలు ముగిసిన 75 రోజులలోగా సమర్పించాలని పేర్కొంది.
పెయిడ్ న్యూస్ అని అనుమానం వస్తే కఠిన చర్యలు
డిజిటల్ ప్రచారం పైన పూర్తి నియంత్రణను తీసుకురావాలని ఎన్నికల సంఘం భావిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ మీడియా మాధ్యమాలలో వచ్చే వార్తలను mcmc బృందాలు నిశితంగా గమనిస్తాయని, పెయిడ్ న్యూస్ అని అనుమానం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications