TS RTC: బస్సులో వ్యక్తి మృతి.. మృతదేహాన్ని ఇంటికి తరలించిన కండక్టర్, డ్రైవర్
సామాన్య ప్రజలను గమ్యస్థానాలకు చేర్చుతూ ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తోంది టీఎస్ఆర్టీసీ. తక్కవ ధరలో ప్రయాణికులను సుదూర ప్రాంతాలకు తరలిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో కూడా సేవలు అందిస్తోంది. ఆర్టీసే కాదు ఆర్టీసీ కార్మికులు కూడా ఎన్నో సార్లు ప్రయాణికులు మరిచిపోయిన డబ్బు బ్యాగులు, బంగారాన్ని తిరిగి ప్రయాణికులకు అందించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ బస్సులో చనిపోయిన వ్యక్తిని ఇంటి వద్దకు తీసుకొచ్చారు.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఈ నెల 14న మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్తోంది. కురవి మండలం మోదుగులగుడెంకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు. అయితే అతనికి సడెన్ గా గుండెపోటు వచ్చింది. బస్సులోని వారు వెంటనే 108కి సమాచారం ఇచ్చారు. వీరులో బస్సులో 108కి ఎదురుగా వెళ్లారు. అయితే హుస్సేన్ అప్పటికే మృతి చెందాడు.

అతని చనిపోవడంతోనే మిగతా ప్రయాణికులు కిందకు దిగారు. బస్సు కండక్టర్ నాగయ్య, డ్రైవర్ కొమురయ్య బస్సులో హుస్సేన్ చనిపోయిన విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పై అధికారుల ఆదేశాలతో నాగయ్య, కొమరయ్య హుస్సేన్ మృతదేహాన్ని బస్సులోనే 30 కిలోమీటర్ల దూరం ఉన్న మోదుగులగుడెంకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని ఇంటికి తరలించిన నాగయ్య, కొమురయ్యకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలుసుకున్నారు. శనివారం బస్‌భవన్‌లో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్య, డిపో మేనేజర్ విజయ్ ను ఎండీ సజ్జనార్ సన్మానించారు. నాగయ్యయ, కొమురయ్యను మిగతా ఆర్టీసీ కార్మికులు కూడా అభినందించారు.












Click it and Unblock the Notifications