లిప్ట్ డోరు తెరుచుకోవడంతో.. కొరియర్ బాయ్ దుర్మరణం...
లిప్ట్‌లో పడిపోయి ఓ కొరియర్ బాయ్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. ఓ కొరియర్ బాయ్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా... లిప్ట్ రాకముందే డోర్ తెరిచి అందులో కాలు పెట్టడంతో కిందపడి మరణించాడు. గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిప్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టాడు ఓ కొరియర్ బాయ్. దాంతో నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా లిప్ట్‌పై పడ్డాడు.
ఆ తర్వాత లిప్ట్ పైకి రావడంతో కొరియర్ బాయ్ స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందాడు. ఈ షాకింగ్ ఘటన రంగారెడ్డిలోని పటాన్‌చెరులో చోటుచేసుకుంది.పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం... జేమ్స్ అనే ఓ వ్యక్తి మయూరీ నగర్‌లో నివాసముంటున్నాడు. అతనికి 38 యేళ్లు. గత కొంతకాలంగా జేమ్స్ ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంతో కలిసి మయూరీ నగర్‌లోని నివసిస్తున్నాడు. అయితే, జేమ్స్ పనిలో భాగంగా డిసెంబర్ 7న మధ్యాహ్నం అశోక్ నగర్‌లోని నివాస్ టవర్స్ అనే అపార్టుమెంట్‌కు వెళ్లాడు. అక్కడ నాలుగో అంతస్తులో ఇచ్చిన పార్సిల్‌ను రిటర్న్ తీసుకోవడానికి వెళ్లిన జేమ్స్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
ఫోన్ మాట్లాడుతూ... గమనించకుండా లిప్ట్‌లో కాలుపెట్టాడు..
పార్సిల్‌ను తీసుకున్న జేమ్స్ తిరిగి కిందకు వెళ్లేందుకు ఫోన్ మాట్లాడుతూ నాలుగో అంతస్తులోని లిప్ట్ గ్రిల్ డోర్ ఓపెన్ చేశాడు. లిప్ట్ పైకి రాక కిందే ఉండిపోయింది. అయితే, అది గమనించని కొరియర్ బాయ్ లిప్ట్ ఉందేమో అనుకుని లోపలికి వెళ్లేందుకు కాలుపెట్టాడు. అంతే, మొదటి అంతస్తులో ఉన్న లిప్ట్ పైభాగంలో పడిపోయాడు.
అయితే, అప్పడే వేరేవారు లిప్ట్ ఆన్‌చేసి పై అంతస్తులోకి వెళ్లారు. ఆ పైభాగంలో ఉన్న స్లాబ్ తగలడంతో తీవ్రంగా గాయపడి జేమ్స్ అక్కడిక్కడే మృతి చెందాడు. మూడో అంతస్తులో లిప్ట్ ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చిన మెకానిక్ పైభాగంలో మనిషి చనిపోయి ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని అపార్టుమెంట్ వాసులకు, పోలీసులకు చెప్పాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది.












Click it and Unblock the Notifications