Loksabha Election 2024: అలా చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన ఈసీ..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సరిగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా రాజయ పార్టీలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎవరైనా ప్రచార ర్యాలీలకు పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 13 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని చెప్పారు. ఏప్రిల్ 15 వరకు ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఎన్నికలు సజావుగా జరగాలంటే ప్రజల సహకారం కూడా ఉండాలన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచినట్లు తెలిపారు. ఇప్పటికే ఎలాంటి పత్రాలు లేని, అనుమతులు లేకుండా తరలిస్తున్న వంద కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

The EC has made it clear that strict action will be taken if election rules are violated

పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి నేటి వరకు హైదరాబాద్ లో రూ.12, 87,21, 620 నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ. కోటి 86 లక్షల విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 19,798 లీటర్ల మద్యాన్ని పట్టుకొని146 మంది పై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఇతర పోలీస్ అథరిటీ /ఐటి శాఖ ఆధ్వర్యంలో 17 లక్షల 50 వెలు నగదు, 90, 523 రూపాయల విలువ గల ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అలాగే 3,105 లీటర్ల అక్రమ మద్యం పాటుకొని ఇద్దరి పై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఎన్నికలకు సంభందించిన నగదు, ఇతర వస్తువుల పై 5 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించినట్లు చెప్పారు. నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
29 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేశారాని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+