వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ లో రేవంత్ పోరాటం.!రేవంత్ పై టీపిసిసి నేతల పోరాటం.!రంజుగా టీ కాంగీ రాజకీయం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అందరూ రహదారి అంటుంటే వాళ్లది మాత్రం గోదారి అన్న చందంగా తయారయ్యింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల పరిస్దితి. గత కొన్ని రోజుల నుండి క్షుణ్నంగా పరిశీలిస్తే ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై కార్యచరణతో ముందుకు వెళ్లకుండా పార్టీ అంతర్గత వ్యవహారం, పీసిసిలో చోటుచేసుకుంటున్న పరిణమాలు, పీసిసి అద్యక్షుడి వ్యవహారంతో పాటు పార్టీ లోపల జరిగే అంశాలపైనే నేతలు ముష్టి యుద్దానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టిన దగ్గర నుండి ఏదో ఒక మూల నుండి ఎవరోఒక నాయకుడు వ్యతిరేక గళం విప్పుతూనే ఉన్నారు. అది పరాకాష్టకు చేరి శనివారం ఏకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో అసమ్మతిగళం బహిరంగంగా వినిపించేందుకు సిద్దమయ్యారు సీనియర్ నేతలు.

 జాబితాలో వలసనేతలకు ప్రాధాన్యం.. తీవ్ర అసంతృప్తిలో సీనియర్లు..

జాబితాలో వలసనేతలకు ప్రాధాన్యం.. తీవ్ర అసంతృప్తిలో సీనియర్లు..


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చావుబతుకుల మద్య కొనఊపిరితో కొట్టుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డిని పీసిసి అధ్యక్షిడిగా బాద్యతలు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటినుండి రేవంత్ రెడ్డిపై తరుచుగా వ్యతిరేకగళం వినిపిస్తూనే ఉంది. మొదట్లో కోమటి రెడ్డి వెంకట రెడ్డి మొదలుకొని ఈ మద్య పార్టీ మారిన మర్రి శశిధర్ రెడ్డి వరకూ అందరూ అనేక విమర్శలు గుప్పించారు. మర్రి, దాసోజు, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి కొంత మంది పార్టీని కూడా విడిచిపెట్టి వెళ్లిపోయారు. పార్టీలో ఉంటూ జగ్గారెడ్డి లాంటి కొంత మంది నేతలు అమాస్యరోజుల్లో రేవంత్ పై విమర్శలు గుప్పించడం, పౌర్ణమి రోజుల్లో తూచ్ ఉత్తదే.. రేవంత్ కు తమకు తోడికోడళ్ల పంచాయితీ అని మీడియా పరంగా ప్రకటన వంటి పరిణామాలు సర్వ సాధారణంగా చోటుచేసుకుంటున్నాయి. కాని శనివారం భట్టి నివాసంలో జరిగిన అసంతృప్తుల సమావేశం మాత్రం కాస్త సీరియస్ గానే కనిపిస్తోంది.

 భట్టి నివాసంలో భేటీ.. పంచాయతీ ఢిల్లీలో తేల్చుకోవాలంటున్న సీనియర్లు

భట్టి నివాసంలో భేటీ.. పంచాయతీ ఢిల్లీలో తేల్చుకోవాలంటున్న సీనియర్లు


ఏఐసీసీ నూతన పీసిసి కూర్పుతో ప్రకటించిన జంబో పదవులు జాబితా ప్రస్తుతం పీసిసి సీనియర్ల ఆగ్రహ జ్వాలలకు ఆజ్యం పోస్తోంది. నూతన కమిటీలో పార్టీలోకి నూతనంగా వచ్చిన వానికి అదిక ప్రాధాన్యతనిస్తూ, ఎప్పటినుంచో పార్టీ జెండాను మోస్తున్నవారికి అన్యాయం చేసారని, రేవంత్ రెడ్డి పార్టీలో సీనియర్ల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది ప్రస్తుతం భట్టి నివాసంలో భేటీ ఐన నేతల వాదన. ఇదే జాబితాలో 60నుండి 70శాతం సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన నేతలని, వలస వచ్చిన నాయకులకు ఆఘమేఘాల మీద పదవులు ఎలా కట్టబెడతారన్నదే వీళ్ల సూటి ప్రశ్న. అందులో భాగంగా రేవంత్ రెడ్డి మొన్నటివరకూ నాటుగు గోడల మద్య నలిగిని అసమ్మతి గళం నేడు అదిష్టానం దగ్గర తేల్చుకునేందుకు సై అంటోంది.

 పార్టీని గెలిపించలేకపోయిన ఐకమత్యం.. రేవంత్ రెడ్డిపై మూకుమ్మడి పోరాటం..

పార్టీని గెలిపించలేకపోయిన ఐకమత్యం.. రేవంత్ రెడ్డిపై మూకుమ్మడి పోరాటం..

ఏఐసీసీ కొత్తగా ప్రకటించిన జాబితాలో ఒరిజినల్ కాంగ్రెస్ వారికి కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని, ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారన్నది టీ కాంగ్రెస్ సీనియర్ నేతల వాదన. రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టి పదిహేడు నెలలు కావస్తోంది. అంతకు ముందు రెండు సార్లు పీసిసి అద్యక్షుడిగా బాద్యతలు నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే ఒరిజనల్ కాంగ్రెస్ నేతల సహకారంతో పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకురాలేకపోయారనే ప్రశ్నకూడా గాంధీ భవన్ నుండి వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసిసి అద్యక్షుడు కాకముందు టీపిసిస నేతల్లో ఈ ఐకమత్యం ఏమయ్యింది.?తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను ఎందుకు విజయతీరాలకు చేర్చలేకపోయారన్నది కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు సంధిస్తున్న ప్రశ్న. ఈ రోజు భేటీ నిర్వహించుకుని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన నేతలు ఈ సందేహాలకు సమాధానం చెప్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు.

 సీనియర్లకు ఒరిగేదేంటి.? రేవంత్ ను తప్పిస్తే పార్టీ అదికారంలోకి తెస్తారా??

సీనియర్లకు ఒరిగేదేంటి.? రేవంత్ ను తప్పిస్తే పార్టీ అదికారంలోకి తెస్తారా??

రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో జవసత్తువలు వచ్చాయని, చచ్చిపోయి అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఊపిరిలూదడన్న చర్చ ప్రస్తుత సీనియర్లకు ఎందుకు వినబడడం లేదంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి కారణంగా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పదేపదే చెప్తున్న నాయకులు, రేవంత్ రెడ్డికి ముందు పార్టీని ఎందుకు గెలిపించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. ముందుండి పార్టీని నడిపించే వాడికి సహకరించకుండా చీటికి మాటికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వల్ల పార్టీ అదికారంలోకి వస్తుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. జంబో జాబితాలో చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలిగానీ, వాటిని ఆసరగా చేసుకుని పీసిసి అద్యక్షుడిని టార్గెట్ చేయాలనుకోవడం వల్ల సీనియర్లకు ఒరిగేదేంటనే చర్చ జరుగుతోంది.

English summary
Ever since Revanth Reddy took over the reins of PCC, some leader has been raising his voice from some corner. It culminated on Saturday when the senior leaders got ready to publicly voice their disagreement at CLP leader Bhatti Vikramarka's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X