Drinking Water: తాగు నీటి కోసం 10 మంది ఐఏఎస్ అధికారులు..!
రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి వాడకం పెరిగింది. ఎండ తీవ్రతకు జలాశయాల్లో నీరు అడుగట్టుతోంది. ఈ నేపథ్యంలో తాగు నీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో తాగు నీటి సరఫరాను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించింది.
33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా రాష్ట్రం తాగునీరు సరిగా సరఫరా అయ్యే విధంగా చూసుకోవాలి. వీరు జులై చివరి వరకు సెలవులు పెట్టకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పలు ప్రాజెక్టుల్లో ఇప్పడే నీటి మట్టం డెట్ స్టోరేజీకి చేరింది. దీంతో నీటి కొరత రాకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నీటిని వృథా చేయకూడదని ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలను కోరింది.

ఇప్పటికే బెంగళూరులో నీటి భారీగా ఏర్పడింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగుళూరు పరిస్థితి హైదరాబాద్ లో రాకూడదని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మరోవైపు హైదరాబాద్ కు నీరు అందించే కృష్ణా నది ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి. ఇటు ఎల్లంపల్లిో కూడా నీటి మట్టం తగ్గుతోంది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీటిని తరలిస్తున్నారు.
నీటి కొరత పట్ల ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వానికి నీరు మేనెజ్మెంట్ తెలియదని చెబుతున్నాయి. భాగ్యనగరంలో పదేళ్లుగా తాగు నీటి కష్టాలే రాలేదన్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల దందా కొనసాగుతోందన్నారు. నాగార్జునసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో నీళ్లు ఉన్నాయన్నారు. సాగర్ నుంచి 14 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications