ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు తాళి కట్టిన వరుడు
గురువారం లంబాడిపల్లిలో వివాహం జరగాల్సి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది.
ఆ పెళ్లిలో భాజాభజంత్రీలు మొగలేదు. అంబులెన్స్ సైరన్లే వినిపించాయి. మంగళ వాయిద్యాల మొతే లేదు.. పేషెంట్ల కోసం హడావిడిగా తిరిగే వైద్యుల బూట్ల చప్పుడే ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని సంఘటన మంచిర్యాల లో జరిగింది. ముహూర్తం ప్రకారం కల్యాణ మండపంలో పెళ్లి పీటలపై జరుగవలసిన వివాహం ఆసుపత్రిలో జరిగింది. శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతి కి వివాహం నిశ్చయమైంది. గురువారం లంబాడిపల్లిలో వివాహం జరగాల్సి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించి బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో పెళ్లిపీటలమీదకు నడవాల్సిన ఆ వధువు ఆ ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా ఉండిపోయింది.

విషయం వరుడు తిరుపతి కి తెలియడంతో కంగారుపడ్డాడు. అంతేకాకుండా ఇరువైపులా కుటుంబాలవారు పెళ్లి ఏర్పాట్లు చేశారు. దీనికోసం శాయశక్తులా ఖర్చుచేశారు. అకస్మాత్తుగా వివాహాన్ని రద్దుచేసుకోవాలంటే రెండోసారి అంత ఖర్చుపెట్టి వివాహం చేసుకునేంత స్తోమత ఇరువైపు కుటుంబాలకు లేదు. అంతేకాకుండా ముహూర్తం కోసం మళ్లీ నెలల తరబడి ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇవన్నీ అంచనా వేసుకున్న ఇరువైపుల పెద్దలు గతంలో నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఆసుపత్రిలో వధువు మెడలో మూడుముళ్లు వేయించాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో వైద్యుల అనుమతితో పూజారిని తీసుకొని ఆయన వేదమంత్రాలు చదువుతుండగా తిరుపతి శైలజ మెడలో మూడుముళ్లే వేశాడు. ఇద్దరూ ఒక్కటయ్యారు.
పెళ్లి పీటలపై జరగాల్సిన పెళ్లి హాస్పిటల్ బెడ్ పై జరిగింది..!!#Adilabad #Mancherial #TelanganaNews #Marraige #Oneindiatelugu pic.twitter.com/XDEtQ5Eeji
— oneindiatelugu (@oneindiatelugu) February 24, 2023












Click it and Unblock the Notifications