Sunil Kanugol: సునీల్ కనుగోలు పిటిషన్‍పై తీర్వు రిజర్వ్ చేసిన హైకోర్టు..
కాంగ్రెస్ పార్టీ వ్యహకర్త సునీల్ కనుగోలు పోలీసులు 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద ఇచ్చిన నోటీసుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలను విన్న రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం తీర్పును జనవరి 2, 2023కు వాయిదా వేసింది.

వీడియో స్పూఫ్ లు
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ తో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు తరఫు న్యాయవాది వాదించారు. ఈ కారణంగా ఎఫ్ఐఆర్ లో తన పేరును తొలగించాలని కోరారు. వీడియో స్పూఫ్ లకు సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎఫ్ఐఆర్ లో సునీలు కనుగోలు పేరును తొలగించాలని కోరారు.

ఏ1
సీసీఎస్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు ఏ1 గా ఉన్నాడని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

సునీల్ కనుగోలు కార్యాలయం
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మాదాపూర్ లోని సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు చేశారు. సీఎం కేసీఆర్ తో పాటు మహిళలపై అనుచితంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు అందడంతోనే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం సునీల్ కనుగోలుకు సీఆర్‌పీసీ 41 ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు.

10 రోజుల సమయం
అయితే ఈ నోటీసులకు సంబంధించి తనకు 10 రోజుల సమయం కావాలని సునీల్ కనుగోలు పోలీసులను కోరారు. దీంతో ఈ నెల 27న మరోసారి సీసీఎస్ పోలీసులు సునీల్ కనుగోలుకు నోటీసులు అందించారు. ఇందులో ఈ నెల 30న విచారణకు రావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సునీల్ కనుగోలు హైకోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications