శభాష్ నర్సమ్మ.. కిలోమీటరు పరుగెత్తి దొంగను పట్టుకున్న వీర మహిళా..
మహిళే కాదా.. ఏం చేస్తుందనుకున్నాడు. ఆమె చేతిలో ఉన్న డబ్బును లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ ఆ మహిళా దుండగుడి వెంటాడి పట్టుకుంది. పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో జరిగింది. దొంగను వెంటాడి పట్టుకున్న ఆ మహిళను పోలీసులు, స్థానికులు అభినందించారు.

ఎదులాబాద్
ఎదులాబాద్‌కు చెందిన నర్సమ్మ మహిళా పొదుపు సంఘంలో పెద్దగా వ్యవహిస్తుంది. వారు డ్వాక్రా లోన్ తీసుకున్నారు. పొదుపు సంఘం సభ్యులందరూ నెలనెలా కొంత మొత్తం ఈఎంఐ కడతారు. సభ్యులు కట్టిన మొత్తాన్ని నర్సమ్మ ప్రతీ నెల వచ్చి బ్యాంకులో కడుతుంది.

యూనియన్ బ్యాంకు
అది విధంగా ఈనెల సభ్యులు ఇచ్చిన రూ.50 వేలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు నర్సమ్మ ఘట్‌కేసర్ లోని యూనియన్ బ్యాంకుకు వచ్చారు. అమె డబ్బు చేతిలో పట్టుకుని బ్యాంకులోకి వెళ్లే క్రమంలో.. ఆమెను గమనిస్తూ ఉన్న యువకుడు చేతిలో ఉన్న నగదు తీసుకొని పరుగెత్తాడు. దీంతో ఒక్కసారి షాక్ గురైన నర్సమ్మ తేరుకుని.. గట్టిగా కేకలు వేసింది.

కిలోమీటరు
అంతేకాదు పారిపోతున్న దొంగను సుమారు కిలోమీటరు వరకు వెంటాడి పట్టుకుంది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు దొంగను పట్టుకుని చితకబాదరు. దీంతో సదరు దొంగ ఏడుస్తూ తప్పు అయిపోయింది తనను క్షేమించాలని ప్రాధేయపడ్డాడు. అంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఇలా నర్సమ్మ ధైర్యంతో దొంగను
సివంగిలో వెంటాడి పట్టుకుంది.












Click it and Unblock the Notifications