Suryapeta: ఉపాధి హామీ పనికి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి..

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంటలో ఓ వ్యక్తి ఉపాధి హామీ పనికి వచ్చాడు. సాధారణ ప్రజలతో కలిసి పని చేస్తున్నాడు. అయితే ఆయన్ను చూసేందుకు మీడియాతో పాటు చాలా మంది వచ్చారు. కారణం ఆయన ఓ ఆఫీసర్ అయినా ఉపాధి హామీ పనికి వచ్చాడు. ఉద్యోగం కోల్పోయి పనికి రాలేదు. ఉపాధి కూలీల పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చాడు. కూలీలను అడిగి తెలుసుకోవచ్చు.

కానీ కూలీలు పడే కష్టం ఎలా ఉంటుందో తెలుసుకోవడాని ఆయనే కూలీ అవతరం ఎత్తారు. కష్టం వీలువెంటో అందరికీ చూపించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 2024, జూన్ 17వ తేదీ సోమవారం ఐఆర్ఎస్ అధికారి సందీప్ వచ్చారు. ఉపాధి కూలీలతోపాటు తట్టా, పార పట్టుకొని శ్రమించారు. మధ్యాహ్నం ఉపాధి కూలీలతోనే కలిసి భోజనం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

The IRS officer went to MAHATMA GANDHI NATIONAL RURAL EMPLOYMENT GUARANTEE SCHEME In Suryapeta District

సందీప్ స్వస్థలం హుజూర్ నగర్. ప్రస్తుతం సందీప్ బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్ లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. గ్రామాల్లో కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనుకుని.. నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్లలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనులు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కూలీలతో కలిసి కష్టపడ్డారు.

తర్వాత వారితో కలిసి అన్నం తిన్నారు. బతుకమ్మ పాటకు కూలీలతో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రభుత్వం పథకాలను మహిళలకు వివరించారు. తనతో పాటు పని చేసిన 152 మంది కూలీలకు తన జీతం నుంచి ప్రతి ఒక్కరికీ రూ.200 ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+