Weather Update: వచ్చే మూడు రోజులు వర్షాలే.. ఎల్లో అలెర్ట్ జారీ..
నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. రుతుపవనాలు తెలంగాణ అంతట దాదాపు వ్యాపించినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు తెలంగాణలో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కురుస్తున్న సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో పాటు అక్కడక్కడే పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మంగళవారం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నాగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. బుధవారం రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్గాజిగిరి, మహబూబ్ నాగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

గురువారం వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ఆదిలాబాద్, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి వానలు పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
మరోవైపు ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొనసాగుతోన్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలు కురవకముందే రైతులు సాగు రెడీ అవుతున్నారు. పలు చోట్ల విత్తనాలు కూడా నాటారు.












Click it and Unblock the Notifications