Rains: తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ..
తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పిండిన ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల దూరంలో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురిస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అంతే కాకుండా మయన్మార్ నుంచి మేఘాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నట్లు వివరించింది. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాత్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో జారీ చేసింది. శనివారం వరకు వానలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక హైదరాబాద్ లో తేలిపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. అటు ఆంధ్రప్రదేశ్ లోని వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. గురువారం మన్యం, కాకినాడ, అల్లూరి సీతారామరాజ్, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు పల్నాడు, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఎన్టీఆర్, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
ఉత్తరాదిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. అలాగే 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కన్నారు. సిమ్లాలో కొండచరియలు విరిగిపడి 30 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, భారత వాయుసేన ప్రయత్నాలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications