Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు..!
వర్షాకాలం ముగిసినా రాష్ట్రంలో వర్షాలు తగ్గడం లేదు. ఏదో ఒక చోట వర్షం పడుతుంది. తాజాగా నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే వాయుగుండంగా మారకపోచ్చని.. తీరం వైపునకు అల్పపీడనంగానే వచ్చి బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నవంబర్ 11 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి కోత కోసి వరి ధాన్యాన్ని అరబోశారు. ఇప్పుడు అవి తడిసిపోతాయని భయపడుతున్నారు. మరోవైపు చాలా చోట్ల ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈ అల్పపీడనం వల్ల తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది.

డే టైమ్ లో ఎండగా ఉన్నా సాయంత్రం, రాత్రి ముఖ్యంగా తెల్లవారుజామున చలి పెరుగుతోంది. వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో బుధవారం 14.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది. హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరిగింది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది,.
మార్నింగ్ వాక్ కు వచ్చే వారు తగ్గిపోతున్నారు. చలికాలం వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మందపాటి దుస్తువులు ధరించాలని చెబుతున్నారు. చలితో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశం ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయింది.












Click it and Unblock the Notifications