Weather Report: రైతన్నలకు అలర్ట్.. వారం రోజులపాటు వర్షాలుండవటా..!
రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా.. ఇక వర్షాలు పడతాయని భావించారు. అయితే రుతుపవనాలు వచ్చినా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. తెలంగాణలో వర్షపాతం లోటు ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షాలపై ఆశలు పెట్టుకున్న రైతులు వాతావరణ శాఖ ప్రకటకతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ప్రభావం చూపదని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, సైక్లోనిక్ సర్క్యులేషన్ తెలంగాణ నుంచి దూరంగా వెళ్తోందని తెలిపింది. అల్పపీడనం ఒడిశా తీరం నుంచి చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ దిశగా వెళ్లిపోయినట్లు చెప్పింది. అందుకే తెలంగాణలో వానల పడే అవకాశం లేదని వివరించింది.

దక్షిణ భారతదేశంలో కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోనే వారం పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇక నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గానే కదులుతున్నా వానలు తక్కువేనని తెలిపింది. మంగళవారం ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ధారిలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

నిర్మల్ జిల్లా జామ్‌లో 1.7, సిద్దిపేట జిల్లా శనిగరం, సంగారెడ్డి జిల్లా అన్నాసాగర్‌లో 1.6 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయితే ఇప్పటికే అన్నదాతలు వర్షాలు కురిస్తాయని ఆశతో నారు పోసుకున్నారు. కొందరు విత్తనాలు నాటారు. వీరంతా ఇప్పుడు వర్షాల కోసం చూస్తున్నారు. మరోవైపు వర్షాలు లేక కూరగాయల దిగుబడి తగ్గి ధరలు భారీగా పెరిగాయి.












Click it and Unblock the Notifications