Rythu Bharosa: రైతు భరోసాపై తుమ్మల కీలక వ్యాఖ్యలు..!
రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా నిధులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అయితే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై మేధావులు, రైతుల అభిప్రాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల నుంచి రైతు అభిప్రాయం సేకరించిన తర్వాత రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందిస్తామని చెప్పారు. అంతుకు ముందు అసెంబ్లీ కూడా రైతు భరోసా పథకం ఎలా ఉండాలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
రైతు భరోసాపై మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, సినీ స్టార్లకు, బడా వ్యాపారవేత్తలకు రైతు బంధు ఇచ్చారని. ఇలా రూ.25 వేల కోట్లు ఇచ్చారని శాసన మండలిలో తుమ్మల చెప్పారు. ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్నా.. రుణ మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ. లక్ష లోపు రుణ మాపీ చేసినట్లు ప్రకటించారు. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు.

కాగా ఈసారి తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు కేటాయించారు. ఇందులో రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు, రూ .2 లక్షల రుణమాఫీ కోసం రూ.32 వేల కోట్లు కేటాయించారు. యూనివర్సిటీల కోసం రూ.500 కోట్లు, ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఆర్టీసీలో ఫ్రీ జర్నీకి రూ.2,351 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించారు.
MMTS కు రూ. 50 కోట్లు, HMDA కు రూ. 500 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ. 5 వేల 790 కోట్లు, GHMC కోసం రూ. 3 వేల 65 కోట్లు, విద్యా రంగానికి రూ. 21 వేల 292 కోట్లు, హోం శాఖకు రూ. 9 వేల 564 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 2 వేల 762 కోట్లు, ఇరిగేషన్ శాఖకు రూ. 22 వేల 301 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 16 వేల 410 కోట్లు, అడవులు పర్యవరణ శాఖకు రూ. 1, 064 కోట్లు, IT రంగానికి రూ. 774 కోట్లు కేటాయించగా.. వైద్య ఆరోగ్య శాఖ రూ. 11 వేల 468 కోట్లు
SC సంక్షేమం కోసం రూ. 33 వేల 124 కోట్లు కేటాయించారు. రిజినల్ రింగ్ రోడ్డునిర్మాణం కోసం రూ. 1525 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు కేటాయించారు.












Click it and Unblock the Notifications