The Kerala Story: భైంసాలో ది కేరళ స్టోరీ సినిమా నిలిపివేత.. నిరసనకు దిగిన ప్రేక్షకులు..!
నిర్మల్ జిల్లా భైంసాలో ది కేరళ స్టోరీ సినిమా విషయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సినిమాను చూడటానికి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను పోలీసులు అడ్డుకోవడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. దీంతో బైంసాలోని కమల థియేటర్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సినిమా చూసేంత వరకు థీయేటర్ దగ్గర నుంచి కదిలేదే లేదని ప్రేక్షకులు భీష్మించుకొని కూర్చున్నారు. మే 12న ఉదయం 11గంటలకు కమల థీయేటర్ లో ది కేరళ స్టోరీ సినిమా ఉంటుందని సమాచారం ఇచ్చారు. సినిమాకు సంబంధించి పోస్టర్లు కూడా కట్టారు.
దీంతో సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కు చేరుకున్నారు. కానీ థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శించడం లేదని వెనక్కు వెళ్లాల్సిందిగా కోరింది. ప్రేక్షకులు తాము సినిమా చూస్తామని పట్టుబట్టడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ప్రేక్షకులు, విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని థియేటర్లలో ది కేరళ స్టోరీ సినిమా నడుస్తోందని.. ఈ థియేటర్ లో ఎందుకు నడిపించడం లేదని ప్రేక్షకులు నిలదీశారు. పోలీసుల బెదింపులతోనే కమల థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శన నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కశ్మీర్ ఫైల్స్ అంటే ఏమిటి? అది ఒక వర్గాన్ని కించపరచడమే. కేరళ కథ అంటే ఏమిటి?... ఇది వక్రీకరించిన కథే" అని అన్నారు. ఈ నిర్ణయంపై చిత్ర నిర్మాత విపుల్ షా స్పందిస్తూ న్యాయంగా పోరాడతామని చెప్పారు. ఇటీవల ది కేరళ స్టోరీని తమిళనాడు థియేటర్ల నుంచి తీసేశారు. తమిళనాడు థియేటర్, మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, M సుబ్రమణ్యం ఈ సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నామన్నారు.ది కేరళ స్టోరీలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించారు.
సుదీప్తో సేన్ హెల్మ్ చేసి, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ చిత్రం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ చిత్రం కల్పితమని, సంఘటనల నాటకీయ సంస్కరణ అని ప్రత్యేకంగా చెప్పే సినిమాతో పాటు నిర్మాతలు నిరాకరణను ప్రచురించారని కేరళ హైకోర్టు గతంలో పేర్కొంది. సినిమాపై నిషేధం విధించాలని పలువురు కోరుతుండగా, సినిమా విడుదలపై స్టే ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.












Click it and Unblock the Notifications